Health Mission : ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డుకు రక్షణ, వైద్య విద్యలో సంస్కరణలు – మోదీ

భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్య విద్యలో అపూర్వమైన సంస్కరణలు  జరుగుతున్నాయని, ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా రక్షించబడుతుందన్నారు ప్రధాని మోదీ.

National Digital Health Mission : భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్య విద్యలో అపూర్వమైన సంస్కరణలు  జరుగుతున్నాయని, ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా రక్షించబడుతుందన్నారు ప్రధాని మోదీ. ఆయుష్మాన్ భారత్ – డిజిటల్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు డిజిటల్ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడతాయని, జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశ ప్రజలు డిజిటల్ హెల్త్ ఐడిని పొందుతారని వెల్లడించారు. భారతదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు బలోపేతం అయితే పర్యాటక రంగాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు.

Read More : Narendra Modi : ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, ఎలా పని చేస్తుంది ?

వర్చువల్ ఈవెంట్ : –
సెప్టెంబర్ 27వ తేదీన ప్రధాని కార్యాలయంలో వర్చువల్ ఈవెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజటల్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశంలో 130 కోట్ల ఆధార్ నంబర్లు, 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు, దాదాపు 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద మౌలిక సదుపాయాలు ఏ దేశంలో ఎక్కడా లేవన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా పరిపాలన నుంచి రేషన్ వరకు సాధారణ భారతీయుడికి వేగంగా, పారదర్శకంగా అందుతున్నట్లు తెలిపారు.

Read More :India COVID 19 : గుడ్ న్యూస్! తగ్గుతున్న కేసులు.. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది

కో విన్ యాప్ కీలక పాత్ర : –
కరోనా సంక్రమణ వ్యాప్తిని నివారించడంలో ఆరోగ్య సేతు యాప్ చాలా సహాయపడిందనే విషయాన్న ఆయన గుర్తు చేశారు. ప్రతొక్కరికీ టీకా, ఉచిత వ్యాక్సిన్ ప్రచారం కింద భారతదేశంలో సుమారు 90 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు తెలిపారు. ఇందులో ‘కో-విన్‌’ యాప్ కీలక పాత్ర ఉందని, కరోనా కాలంలో టెలిమెడిసిన్ యొక్క అపూర్వమైన విస్తరణ జరిగిందన్నారు. ఈ – సంజీవని ద్వారా ఇప్పటివరకు దాదాపు 125 కోట్ల రిమోట్ సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. ఈ – సంజీవని సౌకర్యం ద్వారా ప్రతిరోజూ దేశంలోని సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ఇంట్లో కూర్చుని నగరాల పెద్ద ఆసుపత్రుల వైద్యులతో  సంప్రదించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

Read More : Delhi : భారత్ బంద్, ఢిల్లీ – గుర్‌గ్రామ్ భారీ ట్రాఫిక్ జాం, ఎక్కడి వాహనాలు అక్కడే

2 కోట్ల మందికి డోసులు : –
ఆయుష్మాన్ భారత్ పథకం పేదల జీవితంలోని ఆందోళనను తొలగించినట్లు, ఈ పథకం కింద ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా దేశ ప్రజలు ఉచిత చికిత్స సదుపాయాన్ని పొందారన్నారాయన. 7-8 ఏళ్లలో మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది దేశంలో తయారవుతున్నారని తెలిపారు ప్రధాని మోదీ.

దేశంలో ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్న కేంద్రం.
పిఎమ్-డిహెచ్ఎమ్(ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్) కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ అందించనుంది.
ప్రజల ఆరోగ్య సమాచారాన్ని హెల్త్ ఐడిలో నిక్షిప్తం చేయనున్న కేంద్రం.
భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వస్తే  డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడనుంది.

Read More : PM Modi : ఒక్క క్లిక్ చేస్తే..మీ ఆరోగ్య సమాచారం

ఆసుపత్రికి వెళ్లినప్పుడు హెల్త్ ఐడీ ద్వారా వైద్యులకి రోగి పూర్తి ఆరోగ్య సమాచారం తెలియనుంది.
ఒకవేళ కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలు సైతం డిజిటల్ హెల్త్ ఐడిలో నమోదు.
దేశంలో ఆరోగ్య రంగంలో సౌకర్యాలను బలోపేతం చేయడంలో ఇది మరో దశ.
ఆరోగ్యరంగానికి టూరిజంతో చాలా బలమైన సంబంధం ఉంది.

ట్రెండింగ్ వార్తలు