brinjal : వంగలో మొవ్వ, కాయతొలచు పురుగు నివారణ చర్యలు

దీని నివారణకు నారుమడి నుండి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి.

brinjal

brinjal : వంగ అన్ని రుతువులలో సాగుకు అనుకూలమైన కూరగాయల పంట, చౌడును తట్టుకుంటుంది. వంగ తోటలను చీడపీడలు ఆశించి నష్టం కలిగించటం వల్ల ఆప్రభావం పంట దిగుబడిపై పడుతుంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టటం ద్వారా నష్ట నివారణను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వంగలో మొవ్వ, కాయ తొలుచు పురుగు సమస్య అధికంగా ఉంటుంది. దీని నివారణపై రైతులు అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.

వంగ పంటను ఆశించే పురుగుల్లో అతిముఖ్యమైనది కాయతొలచు పురుగు. ఈ పురుగునాటిన 40 రోజుల నుండి పంటను ఆశించి నష్టం కలుగ జేస్తుంది. మొక్క పెరిగే దశలో మొవ్వను , తర్వాత దశలో కాయలను తొలిచి వేస్తుంది. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. కాయలు వంకలర్లు తిరుగుతాయి. తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. గుడ్లు నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు, కొమ్మలను , పూలను, కాయలను నష్టపరుస్తాయి.

READ ALSO : Eggplant Cultivation : వంగసాగులో చీడపీడల బెడద! పాటించాల్సిన జాగ్రత్తలు

దీని నివారణకు నారుమడి నుండి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి. పొలంలో లింగాకర్షక బుట్టలను ఎకరాకు 10 చొప్పున అమర్చితే మగ పురుగులు ఆకర్షితమై, బుట్టలో పడి చనిపోతాయి. ఈ బుట్టల ద్వారా పురుగు యొక్క ఉనికి , ఉధృతి గమనించుకుని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

పూత దశలో వేపనూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. వేపనూనె తల్లి పురుగులకు వికర్షికంగా పనిచేసి గుడ్లను పెట్టకుండా అరికడుతుంది. పురుగు ఉధృతి గమనించుకుని స్పైనోసాడ్ 0.3మి.లీ. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ఫ్లూ బెండియమైడ్ 0.2మి.లీ లీటరు నీటికి కలిపి పదిరోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు