Eggplant Cultivation : వంగసాగులో చీడపీడల బెడద! పాటించాల్సిన జాగ్రత్తలు

పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగుభాగాన గూళ్ళు ఏర్పరచుకొని రసం పీల్చడం వలన అకులపై తెలుపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్క ఎదుగుదల మరియు పూత, కాయపై ప్రభావం ఉంటుంది.

Eggplant Cultivation : విస్తృతంగా సాగు చేయబడే కూరగాయ పంటలలో వంగ కూడా ఒకటి దీని సాగు పరిస్థితుల విషయానికి వస్తే అధిక తేమ మరియు నిరంతర పోషక సరఫరా మరియు మొక్క స్వభావం వలన వివిధ దశలలో అనేక చీడపీడలు ఆశిస్తాయి. వంగలో చీడపీడలు వలన పంటకు నష్టం వాటిల్లుతుంది.

వంగను అశించే పురుగులు: మొక్క పెరుగుదల దశలో, మొవ్వు వేసే దశలో, పూతకాయ ఏర్పడే దశలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు, అక్షింతల పురుగు మరియు వివిధ రసం పీల్చే పురుగులు పంటను ఆశిస్తాయి.

అక్షింతల పురుగు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి ఆకు పత్రహరితాన్ని గోకి తిని ఆకులను జల్లైడలాగ మారుస్తాయి. కొమ్మ మరియు కాయతొలుచు పురుగు మొక్క శాఖీయ దశలో ఎదుగుతున్న కొమ్మలోనికి ప్రవేశించి తినడం ద్వారా కొమ్మయొక్క మొదలు భాగం వాడిపోతుంది. తద్వారా మొక్క ఎండి చనిపోతుంది. కాయ ఏర్పడే దశలో కాయలోకి ప్రవేశించి లోపలి భాగాన్ని తిని విసర్జనతో నింపుతాయి. ఆ తర్వాత కాయ బయటకు, వచ్చి. కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. దీని వలన కాయలపై రంధ్రాలు ఏర్పడతాయి.

రసం పీల్చే పురుగులు;

పచ్చదోమ, తెల్లదోమ, పేసుబంక: పిల్ల మరియు తల్లి పురుగులు, ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు పసువు రంగుకు మారి వడలిపోతాయి. ఉధృతి ఎక్కువగా. ఉన్నట్లయితే కాయ ఎదుగుదల లోపించి దిగుబడులు తగ్గుతాయి. పచ్చదోమ వెర్రి తెగులు వైరస్‌ను కూడా వ్యాప్తి చేస్తుంది.

తామర పురుగులు: పిల్ల మరియు. తల్లి పురుగులు అకులు, కాయలను ఆశించి రసం గోకి పీల్చడం ద్వారా ఆకులు, కాయలపై తెల్లటి చారలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయలు వంకరతిరిగి ఉంటాయి.

పిండి నల్లి : పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసం. పీల్చడం వలన ఆకులు వసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఇవి మొక్కల మీద తెల్ల సున్నం వేసినట్లు కనిపిస్తాయి. ఒకవేళ పిందెలను ఆశించినచో కాయ ఏర్పడుటపై ప్రభావం కలుగుతుంది. తద్వారా దిగుబడులు తగ్గుతాయి.

ఎర్రనల్లి : పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగుభాగాన గూళ్ళు ఏర్పరచుకొని రసం పీల్చడం వలన అకులపై తెలుపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్క ఎదుగుదల మరియు పూత, కాయపై ప్రభావం ఉంటుంది.

చీడ వీడల నిఘా: వివిధ కీటకాల నిఘా కొరకు ఎరలు ఏర్పాటు చేసుకోవాలి. కొమ్మ మరియు కాయ తొలుచు పురుగుల నిఘౌకు లింగాకర్షణ బుట్టలు, బట్టో ఎరలు, రసం పీల్చే పురుగుల
తెల్లదోమ, పేనుబంక నిఘాకు పసువు రంగు పళ్ళాలు, జిగట కాగితాలు/అట్టలు. పొలంలో మొక్క ఎదిగే దశలో, పూత, కాయ ఏర్పడే దశలో ఏర్పరచి తరచుగా వాటిని పర్యవేక్షించాలి. కీటకాల సంఖ్య నష్టం కలుగజేయు సమయంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగును సరిగ్గా గుర్తించి సిఫార్సు. చేసిన మోతాదులో వాడినబట్లేతే పురుగులను సమర్ధవంతంగా అరికట్టడమే కాక పర్యావరణానికి కూడా ఎటువంటి. హాని కలుగకుండా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;

వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవాలి. పంట అవవేషాల నిర్మూలన చేపట్టాలి. చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. సకాలంలో కలుపు నివారణ చేపట్టాలి. చీడపీడల నుండి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ మొక్కజొన్న, జొన్న పంటలను వేసుకోవాలి. ఎకరానికి 4  చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. రసం పీల్చే పురుగులను ఆకర్షించేందుకు జిగురు అట్టలను ఏర్పటు చేయాలి.

ట్రెండింగ్ వార్తలు