Marigold Cultivation : పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు.. లాభాలు గడిస్తున్న రైతు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Marigold Cultivation : ఎప్పుడూ మూస పంటలైన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్న రైతులకు లాభనష్టాలమాట పరిపాటిగా మారింది. పదేపదే వేసిన పంటలే వేయటం వల్ల సాగులో ఇబ్బందులు తప్పటం లేదు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పసుపు, నారింజ రంగులతో  విరబూసిన ఈ బంతితోటను చూడండి.. పామాయిల్ తోటలో ఎత్తైన బెడ్లపై పాలీమల్చింగ్ విధానంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకోవటం వల్ల, మొక్కల నిండుగా పూలతో, తోట కళకళలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, చోడవరం గ్రామంలో ఉన్న ఈ తోట రైతు పెండ్యాల రామచంద్రయ్యది. ప్రస్తుతం పంట దిగుబడులు తీస్తున్నారు.

రైతు రామచంద్రయ్య కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా.. పలు రకాల పంటలను సాగుచేస్తున్నారు. ప్రధాన పంటగా పామాయిల్ సాగుచేస్తూనే అంతర పంటలుగా పూలు, కూరగాయలు సాగుచేస్తున్నారు. బంతి పూల పంటకాలం 120 రోజులు ఉంటుంది. సాధారణంగా ఎకరానికు పది వేల మొక్కలు అవసరం . కానీ అంతర పంటగా కాబట్టి ఈ రైతు ఎకరాలకు 7 నుండి 8 వేల మొక్కలే  నాటాడు. పాలీ మల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్న, డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు.. సమయానికి అనుకూలంగా సూక్ష్మపోషకాలు, ఎరువులు అందించడంతో మంచి దిగుబడులు పొందుతున్నారు.

ప్రధాన పొలంలో నారు నాటిన 35 నుండి 40 రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 60 రోజుల పాట దిగుబడి వస్తుంది . వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల మార్కెట్ లలో అమ్ముతున్నారు. ఇతర పంటల కాలం ఎక్కువ కాబట్టి.. తక్కువ కాలంలో అంటే 120 నుండి రోజుల్లోనే పంట పూర్తయ్యే బంతి సాగును ఎంచుకున్నారు రైతు. పెట్టుబడి తక్కువగా ఉండటం.. సీజన్ ల వారిగా ప్రణాళికలు వేసుకొని సాగుచేస్తూ.. ఎకరాకు లక్ష నుండి 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.

Read Also : Orange Cultivation : బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి – నివారణకు సరైన యాజమాన్యం  

ట్రెండింగ్ వార్తలు