DRR Dhan 65 Paddy : భాస్వరం అవసరంలేని వరి రకాలు.. డి.ఆర్.ఆర్ ధాన్ 60, 65

ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధనా స్థంస్థ రెండు రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

DRR Dhan 65 Paddy : భాస్వరం లోపం లక్షణాలు మొక్కల్లో అన్ని దశలలో కనిపిస్తాయి . కాని లేత మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా, భాస్వర లోపం యొక్క లక్షణాలు సులువుగా గుర్తించగలిగేటట్టు వుండవు.

Read Also : Paddy Cultivation : ఉత్తరకోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు – ముంపును తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలు

ఈ లోపం తక్కువగా వున్నప్పుడు మొక్కలు మరుగుజ్జులుగా ఉండి ఎదుగుదల తగ్గిపోతుంది. అధికంగా ఉంటే కాండం, ఆకులు ఉదారంగులోకి మారి ఎండిపోతుంటాయి. ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధనా స్థంస్థ రెండు రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను అభివృద్ధి చేసింది భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం.

ఇందుకోసం 15 నుండి 20 ఏళ్లుగా భాస్వరం వేయని నేలల్లో రెండు రకాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ రకాలు రైతుల క్షేత్రాల్లో నాణ్యమైన దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి వాటి గుణగణాలేంటో ఐఐఆర్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. ఎల్.వి. సుబ్బారావు ద్వారా తెలుసుకుందాం.

Read Also : Paddy Varieties : పోషకాల వరి వంగడాలు.. డయాబెటిక్ దూరం చేసే వరి రకాలు

ట్రెండింగ్ వార్తలు