Tomato : టమాట ధర కిలో రూ.155.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా రూ. 83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది.

Tomato

Tomato Highest Price : కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. టమాట ధరకు రెక్కలొచ్చాయి. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో వాటిని కొనాలంటేనే సాధారణ ప్రజలు జంకుతున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ. 58 నుంచి రూ. 148 పలుకుతోంది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని పురులియా ప్రాంతంలో మాత్రం టమాట ధర అత్యధికంగా రూ. 155కు చేరింది. ఎండల తీవ్రత, రుతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వ శాఖ పేర్కొన్నారు.

ముంబాయిలో అతి తక్కువగా కిలో రూ.58 పలుకుతుండగా, ఢిల్లీలో రూ. 110, చెన్నైలో రూ. 117, కోల్ కత్తాలో రూ. 148కి చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా రూ. 83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది.

Tomato Price : మండిపోతున్న టమోటా ధర .. కిలో రూ.100

ఢిల్లీలో స్వగ్గీ ఇన్ స్టామార్ట, బ్లిన్ కిట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ అప్లికేషన్స్ కిలో రూ.140 అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు