Political Reactions on Budget 2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్.. రాహుల్ గాంధీ కామెంట్స్ వైరల్

మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టి..

Rahul Gandhi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ సామాజిక మాధ్యమాల్లో RaGa అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాగా అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు ప్రకటించిందో అటువంటి వాటికే ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ అధికంగా కేటాయించిందని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో RaGa ట్యాగ్‌తో నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

‘ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్. మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టి బూటకపు హామీలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వారిని ఆశ్రిత పెట్టుబడిదారులను శాంతింపజేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనమూ లేకుండా అంబానీ, అదానీకి ప్రయోజనాలు కల్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను, గత బడ్జెట్లను కాపీ పేస్ట్ చేశారు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

నిర్మలా సీతారామన్ ఇవాళ చేసిన ప్రతిపాదనలు, రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ఉద్యోగాల కోసం టాప్ కంపెనీల్లో దేశంలోని కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ యువ న్యాయ్ పథకంలోనూ పొందుపర్చారని అంటున్నారు.

Also Read: కేంద్ర బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

ట్రెండింగ్ వార్తలు