Group 4 Jobs: నిలిచిపోయిన గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. అభ్యర్థుల్లో అయోమయం

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. అయితే, వెబ్‌సైట్‌లో మాత్రం ఈ నెల 30 నుంచి దరఖాస్తుల ప్ర్రక్రియ ప్రారంభం కానున్నట్లు సూచిస్తోంది.

Group 4 Jobs: తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న గ్రూప్-4 ఉద్యోగ నియామక దరఖాస్తుల ప్ర్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

అయితే, వెబ్‌సైట్‌లో మాత్రం ఈ నెల 30 నుంచి దరఖాస్తుల ప్ర్రక్రియ ప్రారంభం కానున్నట్లు సూచిస్తోంది. డిసెంబర్ 30 నుంచి వచ్చే జనవరి 19, సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెబ్‌సైట్‌లో దర్శనమిస్తోంది. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ, దీనిపై స్పష్టమైన అధికారిక ప్రకటన రాలేదు. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకుందామని భావిస్తున్న అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 9,168 ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. నిర్దిష్ట షెడ్యూల్ కంటే మూడు వారాల ముందుగానే నోటిఫికేష్ జారీ చేసింది. డిసెంబర్ 1న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్ర్రక్రియ మొదలు కావాల్సి ఉంది.

Suriya : సూర్యతో మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

కాగా, టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో అనేక లోపాలున్నాయి. అందులో ఉద్యోగాలెన్ని ఉన్నాయి? జిల్లాల వారీగా, జోనల్ వారీగా, మల్టీ జోనల్ వారీగా.. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులున్నాయి? వంటి వివరాల్ని ముందుగానే వెల్లడించాల్సి ఉంది. అయితే, ఇలాంటి వివరాలు టీఎస్‌పీఎస్‌సీ జారీ చేస్తున్న ప్రకటనల్లో ఉండటం లేదు. ఉద్యోగ ప్రకటన అసమగ్రంగా ఉంది. దీంతో స్పష్టమైన ప్రకటన కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు