Pune Court : రివర్స్ .. భార్యే భర్తకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు..!

భార్యే భర్తకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో భరణం, జెండర్ అనే చర్చ మొదలైంది. దీంట్లో చదువు..దానికి సబంధించిన సర్టిఫికెట్లు కీలక పాత్ర వహించాయి.

Couples Divorce Case

Pune Court : భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల్లో సాధారణంగా కోర్టులు భార్యలకు భర్త భరణం చెల్లించాలని తీర్పునిస్తుంటాయి. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఓ విడాకుల కేసులో భార్యే భర్తకు భరణం చెల్లించాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈకేసులో భర్తగారి తెలివితేటలకు సదరు భార్య తెల్లముఖం వేయాల్సి వచ్చింది. ఆమె నాకంటే ఎక్కువ చదువుకుంది కాబట్టి ఆమే నాకు భరణం ఇవ్వాలని పట్టుబట్టాడు.విచిత్రంగా కోర్టుకూడా అతనికి అనుకూలంగా తీర్పునిస్తు భార్యే భర్తకు రూ.50వేలు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది…

ఇటీవల కాలంలో యువతీయువకులు విడాకులు తీసుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. వారి వివాహానికి ప్లాన్ వేసుకున్నంత కాలం కూడా వివాహబంధంలో కొనసాగలేకపోతున్నారు. ఫలితంగా విభేధాలు..దీంతో విడాకులు తీసుకుంటున్నారు. పూణెకు చెందిన అటువంటి ఓ యువ జంట విడాకుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈకేసులో భర్త వయస్సు 38, అతను చదివింది బీటెక్. భార్య వయసు 33. ఆమె ఎంటెక్ చేసింది.దీంతో సదరు భర్త నా భార్య నాకంటె ఎక్కువ చదువుకుంది కాబట్టి ఆమే నాకు భరణం ఇవ్వాలని 2022 మార్చిలో భరణం కోసం కోర్టులో పిటీషన్ వేశాడు.భార్యతో తనకు భరణం ఇప్పించాలని కోర్టును అభ్యర్థించాడు.

దీంతో షాక్ అయిన సదరు భార్య ఇదేంటీ నేను భరణం ఇవ్వటమేంటీ..చట్టాల ప్రకారం అతనే నాకు భరణం ఇవ్వాలని కోరుతు శాశ్వత భరణం కోసం కౌంటర్‌ పిటీషన్ దాఖలు చేసింది. అతనే నాకు భరణం ఇవ్వాలని వాదించింది. ఈ విడాకుల కేసును విచారించిన పుణే సివిల్ జడ్జ్ ఎస్వీ ఫుల్బాంధే.. అతని కంటే ఆమె ఎక్కువ చదువుకుంది పైగా చదువుకు సంబంధించి తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిందంటూ భరణం కింద భర్తకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ సంచలన తీర్పు కాస్తా భరణం, జెండర్ చర్చకు కారణమైంది. ముఖ్యంగా విడాకుల కేసుల్లో జెండర్, భరణం గురించి చర్చకు దారితీసింది. భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించడం సర్వసాధారణమే అయినా ఈ తీర్పు మాత్రం సంచలనంగా ఉందంటూ ఒక మహిళ తన భర్తకు భరణం చెల్లించాలని ఆదేశించిన అరుదైన సందర్భం అని అంటున్నారు. పైగా చదువుకు సంబంధించి తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించటం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిదంటున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు