Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కుమారుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట నమ్మబుద్ధి కావడం లేదు. పునీత్ మరణంతో షాక్‌కి గురై అభిమానులు గుండె పోటుతో మరణించడం బాధాకరం. గురువారం నాడు కంఠీరవ స్టూడియోలోని పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
పునీత్ కుటుంబానికి రాజేంద్రప్రసాద్ పరామర్శ_ Rajendra Prasad Meets Puneeth Rajkumar Family
పునీత్‌ను చివరిసారి చూడలేక పోయిన పలు భాషలకు చెందిన సెలబ్రిటీలు పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. పునీత్ అకాల మరణంతో ఆయన నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయం కన్నడ ఇండస్ట్రీల్ హాట్ టాపిక్‌గా మారింది.
Puneeth Rajkumar : మేమిద్దరం అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం.. ఎమోషనల్ అయిన సూర్య
పునీత్ నటించగా దాదాపు పూర్తి కావొచ్చిన ‘జేమ్స్’ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జేమ్స్’ సినిమాలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
ప్రియా ఆనంద్ కథానాయిక. చేతన్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయ్యింది. కానీ డబ్బింగ్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు. పునీత్ మరణంతో వాయిదా వేశారు. పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్తారని వార్తలు వచ్చాయి.
Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..
కట్ చేస్తే పునీత్ ఒరిజినల్ వాయిస్‌తోనే విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. బ్యాలెన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి పునీత్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చెయ్యబోతున్నారు. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జన్మదినం. వచ్చే ఏడాది ఆరోజున పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..