Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సక్సెస్‌ మీట్‌లో ఏపీలో థియేటర్ల పరిస్థతి గురించి ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి లీడ్ రోల్స్‌లో.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

Shyam Singha Roy : ‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్..

భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓవరీస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన మిగతా ఏరియాల్లోనూ యూనానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిసెంబర్‌లో విడుదలైన సినిమాల గురించి అలాగే ప్రస్తుతం థియేటర్ల విషయంలో జరుగుతున్న విషయాలపై ఆయన మాట్లాడారు.

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

‘‘కరోనా టైం లో కూడా ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగ రాయ్’ తో థియేటర్స్ కళ కళ లాడాయి. యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, సెల్యూట్ గర్వించదగిన విషయం.
బాలీవుడ్‌లో ‘బాహుబలి’ దెబ్బతో ప్రభాస్ బాలీవుడ్‌ను ఏలుతున్నాడు. అల్లు అర్జున్‌కి మలయాళంలో ఎంతో క్రేజ్ వుంది. ఆయన చెప్పిన ‘తగ్గేదే లా’ అనే మాటని ప్రపంచం అనుకరిస్తూ వుంది. ఏపీలో సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది.

SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..

ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మూడు పూలు అరు కాయలుగా ఉన్న తరుణంలో ఇలాంటివి జరగడం దారుణం. ముఖ్యమంత్రి జగన్ గారు సినిమా ఇండస్ట్రీకి మేలు చెయ్యండి. థియేటర్స్ మూసెయ్యకుండ చర్యలు తీసుకోండి.. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది. థియేటర్ యజమానులారా అధైర్య పడకండి, సినిమా హాల్స్‌ను మూసేయకండి.

Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..

థియేటర్ల విషయంలో నిర్మాతల మండలి, ‘మా’ అసోసియేషన్ జోక్యం చేసుకోవాలి. సినీ పరిశ్రమను కాపాడుకోవాలి. ఈ పండుగ వేళ సినీ పరిశ్రమకు గడ్డుకాలం రాకూడదు. థియేటర్ యజమానులు భావోద్వేగానికి గురికాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లండి. దిల్ రాజు, అల్లు అరవింద్ , సురేష్ బాబు సహా పెద్దలంతా ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టాలి’’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు