Odisha Train Accident: రైలు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెల్లడించిన రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా

బహనాగ స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదని, ఈ ప్రమాదం సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలో మీటర్ల వేగంతో వస్తోందని అన్నారు.

Jayavarma Sinha: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. వెయ్యికిపైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. రైలు ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు. సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహనాగ స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిన ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదని, ఈ ప్రమాదం సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలో మీటర్ల వేగంతో వస్తోందని అన్నారు. అదే సమయంలో యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ గంటకు 124 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, రెండు రైళ్లు నిర్దేశిత వేగంతోనే ఉన్నాయని ఆమె వెల్లడించారు.

AP Government: ఒడిశా దుర్ఘటనలో ఏపీ బాధితులకు పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్

కోరమండల్ రైలు లూప్ లైన్ లోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని జయవర్మ సిన్హా చెప్పారు. బహనాగ స్టేషన్ వద్ద రెండు లూప్ లైన్లు, రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయని చెప్పారు. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్ ఓర్ ఉండటంతో ప్రమాదం భారీగా జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ సమస్యల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని జయవర్మ సిన్హా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు