Ram Charan – Upasana : మాల్దీవ్ వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్‌ అండ్ ఉపాసన..

ఇటీవల దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన.. ఇప్పుడు మాల్దీవ్స్ కి పయనమయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి..

Ram Charan – Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ లో ఉన్నారు. దాదాపు రెండేళ్లగా చరణ్ RRR షూటింగ్ అండ్ ప్రమోషన్స్ లోనే ఉండడంతో ఉపాసనతో కలిసి ఎక్కడికి వెకేషన్ కి వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్ ఆమెతో కొంత సమయం స్పెండ్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉపాసనను తీసుకోని దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు దుబాయ్ లోనే ఉపాసన తన సిస్టర్స్ చేత సీమంతం కూడా చేయించుకుంది.

Ram Charan : RRR ఇచ్చిన క్రేజ్‌తో ఆ దేశంలో రంగస్థలం స్పెషల్ షోలు..

ఇక ఇటీవలే డెబ్భై నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ జంట.. ఇప్పుడు మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లారు. నిన్న (ఏప్రిల్ 8) హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చరణ్ అండ్ ఉపాసన మాల్దీవులకు పయనమయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రెగ్నెంట్ తో ఉన్న తన భార్యని సంతోష పరచడానికి రామ్ చరణ్ చేస్తున్న పనులు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. మాల్దీవ్స్ వెకేషన్‌ నుంచి తిరిగి రాగానే చరణ్ గేమ్ చెంజర్ (Game Changer) షూటింగ్ పాల్గొనున్నాడు.

Ram Charan : బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చరణ్.. ఎందులోనో తెలుసా?

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. మరో తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథని అందితున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు