Pawan Kalyan Family : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పదేళ్ల కష్టం తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అయి ఒకేసారి భారీ విజయం సాధించాడు. పవన్ గెలవడమే కాక జనసేన అభ్యర్థులందని గెలిపించాడు. ఇక ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడు. మంత్రిగా కూడా పలు శాఖలు తీసుకున్నాడు పవన్. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.
పవన్ విజయం తర్వాత అకిరా నందన్, ఆద్య కూడా వైరల్ అవుతున్నారు. పవన్ గెలిచిన దగ్గర్నుంచి నాన్న పక్కనే ఉన్నాడు అకిరా. పవన్ ప్రమాణ స్వీకారం రోజు అకిరా, ఆద్య, మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్, భార్య అన్న లేజనోవా, పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Sunil : సునీల్ ‘మర్యాద రామన్న’ హిట్.. మరి ‘మర్యాద క్రిష్ణయ్య’ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు..?
జనసేన అధికారిక సోషల్ మీడియాలో ఈ ఫొటో షేర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇక పవన్ అభిమానులు ఈ క్యూట్ ఫ్యామిలీ ఫొటో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.