Sunil : సునీల్ ‘మర్యాద రామన్న’ హిట్.. మరి ‘మర్యాద క్రిష్ణయ్య’ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు..?

సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ మర్యాద క్రిష్ణయ్య అనే సినిమా కూడా తీశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు.

Sunil : సునీల్ ‘మర్యాద రామన్న’ హిట్.. మరి ‘మర్యాద క్రిష్ణయ్య’ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు..?

Sunil Maryada Krishnayya Movie Not Released Director VN Aditya Sensational Comments

Sunil Maryada Krishnayya : రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ మర్యాద క్రిష్ణయ్య అనే సినిమా కూడా తీశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. మనసంతా నువ్వే ఫేమ్ డైరెక్టర్ VN ఆదిత్య దర్శకత్వంలో ఈ మర్యాద కృష్ణయ్య సినిమా తెరకెక్కింది. రెండేళ్ల క్రితం మర్యాద కృష్ణయ్య టైటిల్ తో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Also Read : Renu Desai : బ్రదర్ అంటూ అడివి శేష్ గురించి రేణు దేశాయ్ పోస్ట్.. అకిరా, శేష్ ఫోటో షేర్ చేసి..

అయితే మర్యాద కృష్ణయ్య సినిమా షూటింగ్ అయినా రిలీజ్ మాత్రం అవ్వలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ VN ఆదిత్య దీనిపై స్పందించారు. VN ఆదిత్య మాట్లాడుతూ.. సునీల్ తో మర్యాద కృష్ణయ్య సినిమా చేసాను. కరోనా సమయంలోనే ఆ షూటింగ్ చేసాము. ఒక ఇంట్లో 27 మంది యూనిట్ స్టాఫ్ అంతా ఉండి అక్కడే వండుకొని, అక్కడే తిని, అక్కడే పడుకొని అక్కడే షూటింగ్ చేసాము. కరోనా సమయంలో అంత కష్టపడి మర్యాద కృష్ణయ్య సినిమా తీశాను. కానీ ఆ సినిమా నిర్మాత చెత్త కారణాలు చెప్పి, అతనికి నచ్చలేదు అని చెప్పి సినిమా రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ చేయనప్పుడు అన్ని డబ్బులు పెట్టి సినిమా తీయడం ఎందుకు అంటూ తెలిపారు.

ఈ విషయంలో కష్టపడి సినిమా తీస్తే అసలు రిలీజ్ చేయనందుకు ఆయన చాలా బాధపడినట్లు తెలిపారు VN ఆదిత్య.