Renu Desai : బ్రదర్ అంటూ అడివి శేష్ గురించి రేణు దేశాయ్ పోస్ట్.. అకిరా, శేష్ ఫోటో షేర్ చేసి..

తాజాగా రేణు దేశాయ్ అడివి శేష్, అకిరా నందన్ కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది.

Renu Desai : బ్రదర్ అంటూ అడివి శేష్ గురించి రేణు దేశాయ్ పోస్ట్.. అకిరా, శేష్ ఫోటో షేర్ చేసి..

Renu Desai Shares Adivi Sesh and Akira Nandan Photo and Calls sesh as Brother

Renu Desai : రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల పవన్ గెలవడం, అకిరా పవన్ వెంటే తిరగడం, రేణు దేశాయ్ వరుసగా అకిరా గురించి పోస్టులు పెట్టడం, అలాగే పవన్ అభిమానుల కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ వైరల్ అవుతుంది రేణు దేశాయ్. తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.

హీరో అడివి శేష్, అకిరా నందన్ మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. గతంలో అడివి శేష్ అకీరాతో దిగిన ఫోటోలు షేర్ చేసి సూపర్ ట్యాలెంటెడ్ అకిరా అంటూ తన మ్యూజిక్ ట్యాలెంట్ గురించి పొగుడుతూ పోస్టులు చేశాడు. తాజాగా రేణు దేశాయ్ అడివి శేష్, అకిరా నందన్ కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది.

Also Read : Raviteja – Harish Shankar : ఓవర్ చెయ్యకు.. డైరెక్టర్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన రవితేజ..

రేణు దేశాయ్ అకిరా, శేష్ ఫోటో షేర్ చేసి.. వేరే తల్లికి పుట్టినా నాకు బ్రదర్ లాంటివాడు అడివి శేష్. అడివి శేష్, అకిరా ఒక క్యూట్ టీమ్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో అడివి శేష్ ని రేణు దేశాయ్ బ్రదర్ అంటూ పోస్ట్ చేయడంతో వీరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)