Raviteja – Harish Shankar : ఓవర్ చెయ్యకు.. డైరెక్టర్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన రవితేజ..

హరీష్ శంకర్ ట్వీట్ కి రవితేజ ఇలా రిప్లై ఇవ్వడంతో..

Raviteja – Harish Shankar : ఓవర్ చెయ్యకు.. డైరెక్టర్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన రవితేజ..

Mass Maharaja Raviteja Reply to Harish Shankar Tweet goes Viral

Updated On : June 23, 2024 / 12:11 PM IST

Raviteja – Harish Shankar : రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హిందీలో అజయ్ దేవగన్ చేసిన రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది మిస్టర్ బచ్చన్. ఇక హరీష్ శంకర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటాడు. మిస్టర్ బచ్చన్ షూటింగ్ లొకేషన్స్ నుంచి కూడా రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షేర్ చేసి ట్వీట్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

Also Read : Jr NTR : ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో చూశారా? నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చి..

తాజాగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సాంగ్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప. కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్ లో దిగుతాము అని మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్ ఇస్తూ పోస్ట్ చేశాడు. అయితే హరీష్ శంకర్ ట్వీట్ కి రవితేజ రిప్లై ఇస్తూ.. ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది అని రిప్లై ఇచ్చాడు.

దీంతో రవితేజ ట్వీట్ వైరల్ గా మారింది. హరీష్ శంకర్ ట్వీట్ కి రవితేజ ఇలా సరదాగా రిప్లై ఇవ్వడంతో మాస్ మహారాజ హ్యూమర్ సెన్స్ మీద సరదా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా దసరా టైం వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Mass Maharaja Raviteja Reply to Harish Shankar Tweet goes Viral