Jr NTR : ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో చూశారా? నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చి..

తాజాగా ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. RRRతో నార్త్ లో కూడా ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దేవర సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ మాస్ గా దేవర సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. దేవర సినిమా కోసం అభిమానులతో పాటు నార్త్ లో కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలో భారీ పార్టీ.. ఏకంగా అన్ని వేల మందితో..

తాజాగా ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఓ ఈవెంట్ కి వెళ్లిన వీడియో ఇది. యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. సీనియర్ నటి శారద పక్కన ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ కూర్చొని ఉన్నాడు. ఎన్టీఆర్ చిన్నప్పుడు కావడంతో నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో, అందులోను నిక్కర్ తో కనపడటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇక ఎన్టీఆర్ చిన్నప్పుడే బాల నటుడిగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్లకే హిట్ సినిమాలతో స్టార్ అయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రానుంది.

ట్రెండింగ్ వార్తలు