Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలో భారీ పార్టీ.. ఏకంగా అన్ని వేల మందితో..

పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ నిర్మాత, పవన్ కళ్యాణ్ సన్నిహిత వ్యక్తి నేడు భారీగా ఓ పార్టీ నిర్వహించనున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలో భారీ పార్టీ.. ఏకంగా అన్ని వేల మందితో..

Tollywood Star Producer arrange a huge Party for Pawan Kalyan Winning

Updated On : June 24, 2024 / 7:30 AM IST

Pawan Kalyan : ఏపీలో ఇటీవల పవన్ కళ్యాణ్ గెలవడంతో పాటు తన జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించుకోవడంతో అభిమానులు కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. వీరితో పాటు సినీ పరిశ్రమకు సన్నిహితంగా ఉండే పలువురు కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో సినీ పరిశ్రమ సంతోషంలో ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి అనేక మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది ఏపీ ఫలితాలపై శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేసారు.

ఇక పలువురు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసి అభినందించారు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలోని ఓ స్టార్ నిర్మాత, పవన్ కళ్యాణ్ సన్నిహిత వ్యక్తి నేడు భారీగా ఓ పార్టీ నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ లో ఆ నిర్మాత సినీ పరిశ్రమలోని ప్రముఖులకు, సినీ మీడియా వ్యక్తులకు ఈ పార్టీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ పార్టీకి దాదాపు 2000 మంది వరకు హాజరవుతారని సమాచారం.

Also Read : Gautam Ghattamaneni : లండన్‌లో నాటకం వేసిన మహేష్ కొడుకు.. గర్వపడుతున్నా అంటూ నమ్రత స్పెషల్ పోస్ట్..

పవన్ కళ్యాణ్, ఆ నిర్మాత చాలా క్లోజ్. ఆ నిర్మాతతో పవన్ ఒకటే సినిమా తీసినా పవన్ కళ్యాణ్ కి బ్యాక్ సపోర్ట్ ఉంటాడు ఆ నిర్మాత. అమెరికాలో కూడా పలు బిజినెస్ లు చేస్తూ మన సినీ పరిశ్రమ వాళ్ళకి అమెరికాలో ఏ సహాయం కావాలన్నా ఆ నిర్మాత సపోర్ట్ చేస్తారు. తన సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గెలవడంతో ఈ పార్టీ అరేంజ్ చేసినట్టు సమాచారం. ఈ పార్టీకి సినీ, మీడియా ప్రతినిధులే కాక పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వస్తారని సమాచారం.