Namrata Shirodkar Shares Family Photos from London and Proud about her son Gautam Ghattamaneni
Gautam Ghattamaneni : మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల లండన్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. గౌతమ్ ప్రస్తుతం లండన్ లోనే చదువుతున్నాడు. గౌతమ్ యాక్టింగ్ కోర్సులే చేస్తున్నట్టు సమాచారం. తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది. లండన్ లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు షేర్ చేసింది నమ్రత.
గౌతమ్ రోమియో జూలియట్ నాటకం వేసినట్టు తెలుస్తుంది. నాటకం అయిపోయిన తర్వాత థియేటర్ బయట దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. బ్యూటిఫుల్ ఈవెనింగ్. లండన్ లో గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి గర్వపడుతున్నాను. ఈ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. నా కొడుకు మరింత బాగా చేసాడు. పిల్లలు అందరూ ఈ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రాంకి కచ్చితంగా రావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదా సాయంత్రాన్ని గడిపాను అంటూ పోస్ట్ చేసింది నమ్రత. దీంతో నమ్రత పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Kalki 2898AD : తెలంగాణలో భారీగా కల్కి టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే.. బెనిఫిట్ షోలు కూడా..
గతంలో కూడా గౌతమ్ ఓ సారి నాటకం వేసినట్టు నమ్రత తెలిపింది. ప్రస్తుతం గౌతమ్ లండన్ లో యాక్టింగ్ కి సంబంధించిన కోర్సులే చేస్తున్నట్టు సమాచారం. దానికి సంబంధించి గౌతమ్ నాటకం వేసాడు అని తెలుస్తుంది. ఆల్రెడీ గౌతమ్ 1 నేనొక్కడ్నే సినిమాలో నటించాడు. సితార కూడా సినిమాల్లోకి వస్తానని తెలిపింది. దీంతో ఈ ఇద్దరు మహేష్ వారసులు సినిమాల్లోకి రావడం ఖాయం అని తెలుస్తుంది. దీనిపై మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.