Ram Charan : RRR ఇచ్చిన క్రేజ్‌తో ఆ దేశంలో రంగస్థలం స్పెషల్ షోలు..

జపాన్ ప్రేక్షకులు చరణ్, ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికి కూడా వారి గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. దీంతో చరణ్ కి జపాన్ లో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇండియన్ సినిమాలు రిలీజ్ చేసే సంస్థ స్పేస్ బాక్స్ చరణ్ మరో సూపర్ హిట్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

Ram Charan :  RRR సినిమాతో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), రాజమౌళికి(Rajamouli) దేశ విదేశాల్లో ఎంత పేరొచ్చిందో అందరికి తెలిసిందే. RRR సినిమాని పలు దేశాల్లో రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. జపాన్(Japan) లో కూడా RRR సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా కూడా నిలిచింది RRR. జపాన్ లో స్వయంగా ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి వెళ్లి RRR సినిమాను గ్రాండ్ గా ప్రమోట్ చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభించింది ఈ సినిమాకు జపాన్ లో.

ఇక జపాన్ ప్రేక్షకులు చరణ్, ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికి కూడా వారి గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. దీంతో చరణ్ కి జపాన్ లో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇండియన్ సినిమాలు రిలీజ్ చేసే సంస్థ స్పేస్ బాక్స్ చరణ్ మరో సూపర్ హిట్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

Upasana : దుబాయ్‌లో ఉపాసనకి సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో!

రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా చరణ్ కి బెస్ట్ కలెక్షన్స్, రికార్డులు, అవార్డులు ఇచ్చింది. చరణ్ కెరీర్ లో ఓ మరిచిపోలేని సినిమాగా నిలిచింది రంగస్థలం. RRR సినిమాతో చరణ్ కి జపాన్ లో మంచి క్రేజ్ రావడంతో చరణ్ రంగస్థలం సినిమాని జపాన్ లో మూడు రోజులు స్పెషల్ షోలు వేస్తున్నారు.

ఏప్రిల్ 9, 10, 11 మూడు రోజులు జపాన్ లోని పలు థియేటర్స్ లో రంగస్థలం సినిమా స్పెషల్ షోలు వేస్తున్నట్టు స్పేస్ బాక్స్ సంస్థ తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకులని మెప్పించిన రంగస్థలం జపాన్ ప్రేక్షకులని ఎంతలా మెప్పిస్తుందో చూడాలి. చరణ్ జపాన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు