Viral Video: ఈ అంపైర్‌కి ఏమైంది? షేక్‌హ్యాండ్ ఇవ్వూ.. అరె నిన్నే బుమ్రా అడుగుతున్నాడు..

మైదానంలో బుమ్రా ఇంతగా అడుగుతున్నా షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు..

టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చేయి చాచి అడిగినప్పటికీ అంపైర్ ఆ పని చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మైదానంలో అంపైర్ కి భారత క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అందరిలాగే అంపైర్ వద్దకు వెళ్లిన జస్ప్రీత్ బుమ్రా షేక్‌హ్యాండ్ ఇవ్వబోయాడు. అయితే, అంపైర్ పట్టించుకోలేదు. దీంతో బుమ్రా తన చేతిని ఇంకాస్త ముందుకు జరిపి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నమూ విఫలమైంది. అంపైర్ షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.

జట్టులోని మిగతా అందరికీ షేక్‌హ్యాండ్ ఇస్తున్న అంపైర్ బుమ్రాను మాత్రం ఎందుకు చూడలేదు. అసలు ఆ అంపైర్ కావాలనే ఇలా చేశాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు బుమ్రాకు ఆ అంపైర్ ఇచ్చీ ఇవ్వనట్లు షేక్‌హ్యాండ్ ఇచ్చాడని కొందరు అంటున్నారు. అంపైర్ ప్రవర్తనతో జస్ప్రీత్ బుమ్రా అయోమయంగా కనపడ్డాడు.

Also Read: బార్బడోస్‌లో రోహిత్ సేన… ఫైనల్ మ్యాచుకు సిద్ధమవుతున్న టీమిండియా

ట్రెండింగ్ వార్తలు