Keearavani : కబంధ హస్తాల నుంచి ఏపీ బయటపడ్డాకే మరణించారు.. రామోజీరావు గారి ఫోటో మా దేవుడి గదిలో ఉంటుంది..

విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

MM Keearavani – Ramoji Rao : ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ ఫిలిం సిటీ, ఈటీవీ, ఈనాడు అధినేత రామోజీరావు గారు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వచ్చి సంతాపం తెలిపారు. తాజాగా నిన్న సాయంత్రం విజయవాడలో ఏపీ ప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.

విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమౌళి, కీరవాణి.. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read : Kalki 2898AD : ‘కల్కి’ సినిమాలో కృష్ణుడిగా నటించింది ఇతనే.. ఎవరితను? డబ్బింగ్ చెప్పింది స్టార్ యాక్టర్.. ఎవరంటే..

కీరవాణి మాట్లాడుతూ.. బతికితే రామోజీరావు గారిలా బతకాలి అని గతంలో ఒక సభలో అన్నాను. ఇప్పుడు చనిపోతే కూడా రామోజీరావు గారిలాగే చనిపోవాలి అంటున్నాను. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేవరకు ఆపుకొని తానే మరణించాడు. అదే విధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ ని కబంధ హస్తాల నుంచి బయటపడటం ఆయన కళ్లారా చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారు. అందుకే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుంది. ఆయన దేవుడ్ని నమ్మరు, దేవుడ్ని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో దేవుడి గదిలో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెల్లో చిరకాలం ఉంటుంది అన్నారు.

ట్రెండింగ్ వార్తలు