Kalki 2898AD : ‘కల్కి’ సినిమాలో కృష్ణుడిగా నటించింది ఇతనే.. ఎవరితను? డబ్బింగ్ చెప్పింది స్టార్ యాక్టర్.. ఎవరంటే..

కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే, వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్.

Kalki 2898AD : ‘కల్కి’ సినిమాలో కృష్ణుడిగా నటించింది ఇతనే.. ఎవరితను? డబ్బింగ్ చెప్పింది స్టార్ యాక్టర్.. ఎవరంటే..

Prabhas Kalki 2898AD Movie Sri Krishna Character Actor and Dubbing Actor Full Details Here

Kalki 2898AD : ప్రభాస్ కల్కి 2898AD సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే సినిమా తీసారని అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతుంది.

కల్కి సినిమాలో ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు. దీంతో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. ఉత్తరగా మాళవిక నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా సీన్స్ తీశారు. కానీ కృష్ణుడి పాత్రకు డైలాగ్స్ కూడా ఉన్నాయి.

Also Read : Kalki America Collections : అదరగొట్టిన కల్కి అమెరికా కలెక్షన్స్.. ఒక్క రోజులోనే సగం రికార్డులు లేపేసింది..

అయితే కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే, వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించిన కృష్ణ కుమార్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. పలు తమిళ్ సినిమాల్లో నటించాడు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో పైలెట్ గా కనపడ్డాడు. ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ గా నటించాడు. ఇప్పుడు ఇలా కృష్ణుడి పాత్రలో కనపడి అలరించాడు. మరి కల్కి పార్ట్ 2లో కృష్ణుడి పాత్ర ఉంటుందని అర్ధమవుతుంది. ఇతను పార్ట్ 2లో కూడా ఉండొచ్చు, అప్పుడు ఫేస్ రివీల్ చేయొచ్చు ఏమో అని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Krishnakumar (KK) (@kk.actor)

ఇక కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ నటిస్తే వాయిస్ ఇచ్చింది మాత్రం వేరే నటుడు. తమిళ్ లో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా దూసుకుపోతున్న అర్జున్ దాస్ కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు తెలుగు, హిందీలో వాయిస్ ఇచ్చారు. అర్జున్ దాస్ మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పవన్ కళ్యాణ్ OG సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇతని వాయిస్ బాగుంటుందని, పవర్ ఫుల్ గా, గాంభీర్యంగా ఉంటుందని పలువురు అభినందించారు. అర్జున్ దాస్ వాయిస్ కి కూడా అభిమానులు ఉన్నారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు పవర్ ఫుల్ వాయిస్ ఇచ్చింది అర్జున్ దాస్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. అర్జున్ దాస్, కృష్ణ కుమార్ నిన్న సినిమా రిలీజ్ అయ్యాక తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో నాగ్ అశ్విన్ కి, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేసారు.

Prabhas Kalki 2898AD Movie Sri Krishna Character Actor and Dubbing Actor Full Details Here