Kalki America Collections : అదరగొట్టిన కల్కి అమెరికా కలెక్షన్స్.. ఒక్క రోజులోనే సగం రికార్డులు లేపేసింది..

అమెరికాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ఒక్క రోజుకే 5వ ప్లేస్ లో నిలిచింది.

Kalki America Collections : అదరగొట్టిన కల్కి అమెరికా కలెక్షన్స్.. ఒక్క రోజులోనే సగం రికార్డులు లేపేసింది..

Kalki 2898 AD Movie First Day America Collections Creates new Record

Kalki America Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నిన్న జూన్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పించింది. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే విజువల్స్ తో హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమాను చూపించడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఇక యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా తీయడంతో ఇండియన్ సినిమా లవర్స్ కల్కి సినిమాని అభినందిస్తున్నారు. ఆల్రెడీ కల్కి సినిమా రిలీజ్ కి ముందే భారీగా థియేట్రీకల్ బిజినెస్ జరగడం, భారీగా ప్రీ సేల్స్ జరగడం అయ్యాయి. మొదటి రోజు కలెక్షన్స్ కూడా దాదాపు 200 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రావొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికాలో రిలీజ్ అయిన మొదటి రోజే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది కల్కి సినిమా.

Also Read : Mahabharatam : మహాభారతం రాజమౌళి తీస్తాడా? నాగ్ అశ్విన్ తీస్తాడా?

అమెరికాలో తెలుగు సినిమాలకు, ఇండియన్ సినిమాలకు డిమాండ్ చాలా ఉంటుందని తెలిసిందే. మన సినిమాలకు అక్కడ భారీగానే కలెక్షన్స్ వస్తాయి. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి అంటే ఆ సినిమా పెద్ద హిట్ అయినట్టే. కొన్ని సూపర్ హిట్ సినిమాలు మరింత భారీగా కలెక్షన్స్ సాధిస్తాయి. ఇప్పటివరకు అమెరికాలో బాహుబలి 2 సినిమా 20 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత RRR, సలార్, బాహుబలి 1, హనుమాన్, అలవైకుంఠపురంలో, రంగస్థలం.. ఇలా పలు సినిమాలు ఉన్నాయి.

తాజాగా ఈ లిస్ట్ లో కల్కి సినిమా ఒక్క రోజులోనే చేరింది. అమెరికాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ఒక్క రోజుకే 5వ ప్లేస్ లో నిలిచింది. ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి కల్కి సినిమా అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సాధించింది. అంటే మన లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే అత్యంత ఫాస్ట్ గా 5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాగా కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది కల్కి. ఒక్క రోజుకే ఇన్ని కోట్లు అమెరికాలో కలెక్ట్ చేసిందంటే ప్రభాస్ హవా, కల్కి సినిమాపై అంచనాలు అక్కడ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మూడు రోజులు వీకెండ్ కూడా ఉండటంతో మిగిలిన సినిమాల కలెక్షన్స్ దాటేసి టాప్ 1 ప్లేస్ కి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.