Vishwak Sen : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసిన విశ్వక్ సేన్.. సోషల్ మీడియాకి మొత్తానికే దూరం.. ఆ ఇష్యూ తరవాతే..

తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.

Vishwak Sen : విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఇటీవల దాస్ కా ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో హిట్స్ కొట్టాడు. విశ్వక్ చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. విశ్వక్ సేన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. తన సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు చేస్తాడు. తనని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వారికి రిప్లైలు ఇస్తాడు. తనపై ట్రోల్స్ చేసే వాళ్లకి కూడా గట్టిగానే సమాధానం చెప్తాడు.

అయితే తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నాను అని పోస్ట్ పెట్టాడు. దీంతో కొన్నాళ్ళు ఏమి పోస్ట్ చేయకుండా దూరంగా ఉంటాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచి అసలు విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనపడట్లేదు. దీంతో మొత్తానికే విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని తీసేశాడని తెలుస్తుంది. ట్విట్టర్ లో మాత్రం అకౌంట్ ఉంది కానీ వాడకపోవచ్చు.

Also Read : Kalki Fight Master : కల్కిలో యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? జర్మన్ ఫైట్ మాస్టర్.. మేకింగ్ వీడియో రిలీజ్..

అయితే ఇటీవల యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై ఫైర్ అయ్యాడు విశ్వక్ సేన్. ఓ యూట్యూబర్ కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో అతనికి సోషల్ మీడియాలో డైరెక్ట్ రిప్లై లు ఇస్తూ దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం తీయమని ఛాలెంజ్ కూడా విసిరాడు. అతను కూడా విశ్వక్ కి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఓ రెండు రోజులు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆ ఇష్యూ జరిగిన తరవాతే ఇప్పుడు విశ్వక్ సేన్ సోషల్ మీడియా నుంచి మొత్తానికే దూరమవడంతో చర్చగా మారింది. దీంతో సోషల్ మీడియాలో విశ్వక్ అకౌంట్ ఏమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఫ్యాన్స్ మాత్రం విశ్వక్ సేన్ సోషల్ మీడియా అకౌంట్ తీసేయడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో విశ్వక్ సినిమాలు రిలీజ్ కి ఏమి లేవు కాబట్టి మళ్ళీ తన సినిమా రిలీజ్ సమయంలోనే విశ్వక్ సేన్ సోషల్ మీడియాలోకి వస్తాడని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు