Kalki Fight Master : కల్కిలో యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? జర్మన్ ఫైట్ మాస్టర్.. మేకింగ్ వీడియో రిలీజ్..

కల్కి యాక్షన్ సీక్వెన్స్ ల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే అవి డిజైన్ చేసింది ఎవరో తెలుసుకోవాలిగా.

Kalki Fight Master : ప్రభాస్ కల్కి 2898AD సినిమా రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రభాస్ – అమితాబ్ కి మధ్య రెండు ఫైట్స్ ఉంటాయి. ఈ రెండూ కూడా హై లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులని మెప్పిస్తాయి.

Also Read : Kalki First Day Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. RRR, బాహుబలి 2 రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందా?

మరి ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే అవి డిజైన్ చేసింది ఎవరో తెలుసుకోవాలిగా. కల్కి సినిమాకి ఈ రేంజ్ లో యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది యాక్షన్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ గ్యుఎఎన్. ఇతను హాంగ్ కాంగ్ మూలాలు ఉన్న జర్మనీకి చెందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నప్పట్నుంచీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్టంట్ మాస్టర్ గా మారాడు. జాకీచాన్ తో కూడా కలిసి పనిచేసాడు.

ప్రస్తుతం యాండీ లాంగ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలకు ఇతను పనిచేసాడు. ఇప్పుడు టాలీవుడ్ లో కల్కి సినిమాతో పరిచయం అయ్యాడు. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో యాండీ లాంగ్, అతని టీమ్ కలిసి కల్కి కోసం అదిరిపోయే యాక్షన్ విజువల్స్ సృష్టించారు. ఇటీవల కల్కి టీమ్ కి, నాగ్ అశ్విన్, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ యాండీ లాంగ్ టీమ్ తరపున సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు.

తాజాగా యూట్యూబ్ లో యాండీ లాంగ్ టీమ్ కల్కి సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ ఎలా తీశారు, అమితాబ్, ప్రభాస్ కి యాక్షన్ ఎలా నేర్పించారు అని చూపించారు. దీంతో ప్రస్తుతం కల్కి యాక్షన్ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు