Prabhas : ‘కల్కి’లో ప్రభాస్ చేసిన పాత్ర.. ఆల్రెడీ ఏక్ నిరంజన్ సినిమాలోనే చేసేసాడు తెలుసా..?

ప్రభాస్ కల్కి సినిమాలో భైరవ పాత్రలో కనిపిస్తాడు. భైరవ బౌంటీ హంటర్ లాగా పనిచేస్తాడు.

Prabhas : ప్రభాస్ కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫుల్ పాజిటివ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది కల్కి. అయితే ప్రభాస్ కల్కి సినిమాలో భైరవ పాత్రలో కనిపిస్తాడు. భైరవ బౌంటీ హంటర్ లాగా పనిచేస్తాడు. అంటే డబ్బుల కోసం ఎవరైనా వెతుకుతున్న వాళ్ళని పట్టుకొని ఇవ్వడం. సినిమాలో కాంప్లెక్స్ మనుషులు వెతుకుతున్న వాళ్ళని పట్టుకొని వాళ్లకు అప్పచెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు భైరవ.

అయితే కొంతమందికి ఈ బౌంటీ హంటర్ అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ సినిమాల్లో బౌంటీ హంటర్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. అయితే ప్రభాస్ అంతకు ముందే బౌంటీ హంటర్ క్యారెక్టర్ చేసాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సినిమా ఏక్ నిరంజన్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసులు వెతుకుతున్న క్రిమినల్స్ ని పట్టుకొని వాళ్లకు అప్పచెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు.

Also Read : Kalki Fight Master : కల్కిలో యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? జర్మన్ ఫైట్ మాస్టర్.. మేకింగ్ వీడియో రిలీజ్..

ఏక్ నిరంజన్ సినిమాలో ఓ సీన్ లో సోను సూద్ ప్రభాస్ ని ఏం చేస్తుంటావు అని అడిగితే ప్రభాస్.. నేను చేసే పనిని తెలుగులో ఏమంటారో తెలీదు కానీ ఇంగ్లీష్ లో బౌంటీ హంటర్ అంటారు. అంటే పోలీసుల కోసం పనిచేస్తాను. వాళ్ళు వెతికే క్రిమినల్స్ ని పట్టుకొని అప్పచెప్తే దానికి పోలీసులు డబ్బులు ఇస్తారు అని చెప్తాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కల్కిలో ప్రభాస్ బౌంటీ హంటర్ లా కనిపించడంతో ఏక్ నిరంజన్ సీన్ వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు