Tamannaah Bhatia : స్కూల్ పుస్తకాల్లో తమన్నా గురించి పాఠం.. తీవ్ర విమర్శలు..

పలువురు సెలబ్రిటీల గురించి స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా చేరుస్తారని తెలిసిందే.

Tamannaah Bhatia : తమన్నా భాటియా సినీ పరిశ్రమకు వచ్చి 19 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా, మెయిన్ లీడ్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగానే ఉంది. అయితే తాజాగా తమన్నా ఓ విషయంలో వివాదంగా మారింది.

పలువురు సెలబ్రిటీల గురించి స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా చేరుస్తారని తెలిసిందే. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖుల గురించి కూడా పలు రాష్ట్రాల్లో స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా ఉంటాయి. అయితే తాజాగా తమన్నా గురించి కూడా కర్ణాటకలో బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చారు. నటి తమన్నా, రణవీర్ సింగ్ ల నాగురించి పాఠ్యాంశాలు చేర్చడంపై వివాదం నెలకొంది. దేశవిభజన తర్వాత సింధీ ప్రజల్లో ప్రముఖుల గురించి చెప్పే పాఠంలో వీరి గురించి చేర్చారు.

Also Read : Kalki First Day Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. RRR, బాహుబలి 2 రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందా?

అయితే సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులు ఉండగా సినిమాల్లో నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. పాఠశాలకు వచ్చి గొడవ కూడా చేసారు. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం చెప్తుంది. దీనిపై పలువురు పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారని సమాచారం. దీనిపై ఇంగ్లీష్ స్కూల్స్ అసోసియేషన్ కర్ణాటక స్పందిస్తూ విచారిస్తామని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు