Kalki First Day Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. RRR, బాహుబలి 2 రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందా?

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లు వస్తుందని ముందు నుంచి అంచనా వేశారు.

Kalki First Day Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నిన్న జూన్ 27న రిలీజయి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే సినిమా తీసారని అంటున్నారు. ఇక మరోవైపు కల్కి సినిమా కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతుంది.

ఇప్పటివరకు అమెరికా కలెక్షన్స్ మాత్రమే అధికారికంగా ప్రకటించారు. నార్త్ అమెరికాలో కల్కి సినిమా ఇప్పటివరకు దాదాపు 5.1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి అమెరికాలో హైయెస్ట్ ఓపెనింగ్ తెలుగు సినిమాగా నిలిచింది. మన లెక్కల్లో దాదాపు 45 కోట్లు కలెక్ట్ చేసింది కల్కి సినిమా అమెరికాలో. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లు వస్తుందని ముందు నుంచి అంచనా వేశారు.

Also Read : Kalki 2898AD : ‘కల్కి’ సినిమాలో కృష్ణుడిగా నటించింది ఇతనే.. ఎవరితను? డబ్బింగ్ చెప్పింది స్టార్ యాక్టర్.. ఎవరంటే..

ప్రస్తుతానికి మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్స్ ఇంకా ప్రకటించలేదు. బాక్సాఫీస్ సమాచారం ప్రకారం కల్కి సినిమా తెలుగులో 70 కోట్లు, హిందీలో 25 కోట్లు, మిగిలిన భాషల్లో 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Kalki America Collections : అదరగొట్టిన కల్కి అమెరికా కలెక్షన్స్.. ఒక్క రోజులోనే సగం రికార్డులు లేపేసింది..

ఇప్పటివరకు తెలుగులో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా 223 కోట్లతో RRR మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా 217 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ రెండిటిని కల్కి సినిమా బ్రేక్ చేయలేదనే తెలుస్తుంది. మూడో ప్లేస్ లో నిలుస్తుందని అనుకుంటున్నారు. అయితే అధికారిక కలెక్షన్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. మొత్తానికి కల్కి సినిమా మొదటిరోజు భారీగానే వసూలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు