Naga Shaurya : మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్.. దర్శన్‌కి సపోర్ట్ చేస్తున్న హీరో నాగశౌర్య.. తీవ్ర విమర్శలు..

హీరో నాగశౌర్య దర్శన్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

Naga Shaurya : కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. పవిత్రని రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు.

ఇప్పటివరకు జరిగిన విచారణలో దర్శన్ స్వయంగా ఈ హత్య చేయించాడని చెప్తున్నారు. అన్ని ఆధారాలు కూడా ముద్దాయి దర్శన్ అంటూ చూపిస్తున్నాయి. ఇటీవల రేణుక స్వామి హత్య చేసిన తర్వాత ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. చాలా దారుణంగా హింసించి అతన్ని చంపారని తెలుస్తుంది. ఈ విషయంలో దర్శన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం దర్శన్ ఆవేశంలో చేసి ఉంటాడని, లేదా కావాలని దర్శన్ ని ఇరికిస్తున్నారని సపోర్ట్ చేస్తున్నారు.

Also Read : Kalki America Collections : అదరగొట్టిన కల్కి అమెరికా కలెక్షన్స్.. ఒక్క రోజులోనే సగం రికార్డులు లేపేసింది..

ఈ క్రమంలో హీరో నాగశౌర్య దర్శన్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాగశౌర్య దర్శన్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ.. మరణించిన వ్యక్తికి సంతాపం తెలియచేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనిపై అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసినవారికి అతని మంచితనం, అతని సహాయగుణం తెలుస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఎప్పుడూ అదనుకుంటారు దర్శన్ అన్న. చాలా మందికి సపోర్ట్ గా నిలిచారు. ఈ వార్తను నేను అంగీకరించలేను. మన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటకు వస్తుంది అని నమ్ముతున్నాను. అలాగే దర్శన్ అన్న కుటుంబం కూడా భాదపడుతుందని గుర్తుంచుకోవాలి. ఎంతోమంచి వారు అయిన దర్శన్ అన్న నిర్దోషిగా బయటకు వస్తారని నమ్ముతున్నాను అంటూ పోస్ట్ చేసాడు.

అయితే ఓ పక్క మర్డర్ దర్శన్ చేయించాడని ఇప్పటికే అనేక ఆధారాలు దొరికాయని పోలీసులు చెప్తుంటే మరో పక్క నాగ శౌర్య అతన్ని సపోర్ట్ చేస్తూ నిర్దోషిగా బయటకి వస్తాడు అని చెప్తూ పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దర్శన్ – నాగశౌర్యకి మధ్య ఉన్న స్నేహం వల్ల అతన్ని సపోర్ట్ చేస్తున్నాడేమో కానీ ఇలా మర్డర్ చేసిన వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో నాగ శౌర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు