Kannada Hero Drashan sent to Central Jail
Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల తన అభిమానిని మర్డర్ చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే పవిత్రని రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు.
ఇప్పటికే ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంత మంది కూడా అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఈ కేసులో అనేక సాక్ష్యాలు దొరకబట్టారు. అయితే దర్శన్ బెయిల్ కి అప్లై చేసినా పోలీసులు బలమైన సాక్ష్యాలు చూపించడంతో బెయిల్ నిరాకరించినట్టు సమాచారం. అలాగే కోర్టు అతని రిమాండ్ ని జులై 4 వరకు పొడిగించింది. దీంతో దర్శన్ ని పోలీసులు బెంగళూరు సెంట్రల్ జైలుకి తరలించారు. దీంతో పోలీసులు దర్శన్ ని, పవిత్ర గౌడని మరోసారి విచారించడానికి తమ కస్టడీలోకి కోరుతూ పిటిషన్ వేయనున్నట్టు సమాచారం.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సినీ పరిశ్రమలో భారీ పార్టీ.. ఏకంగా అన్ని వేల మందితో..
అలాగే ఈ కేసులో రోజురోజుకి మరిన్ని కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ హత్య చేసేందుకు దర్శన్ 40 లక్షలు అప్పు తీసుకున్నట్టు సమాచారం. అలాగే దర్శన్ మరో వీరాభిమాని రాఘవేంద్ర ఈ మర్డర్ విషయంలో దర్శన్ కి సపోర్ట్ గా నిలిచి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. కానీ పోలీసులకు ఇతను కూడా చిక్కడంతో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసు ఇంకెక్కడిదాకా వెళ్తుందో చూడాలి.