Ramesh Deo: వెటరన్ నటుడు రమేశ్ డియో కన్నుమూత

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకున్న వెటరన్ యాక్టర్ రమేశ్‌ డియో(93) కన్నుమూశారు.

Ramesh Deo: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకున్న వెటరన్ యాక్టర్ రమేశ్‌ డియో(93) కన్నుమూశారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించిన రమేశ్ డియో.. బుధవారం(2 ఫిబ్రవరి 2022) గుండెపోటుతో మరణించారు.

రమేశ్ మృతి పట్ల బాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మధ్యే 93వ పుట్టినరోజును జరుపుకున్న రమేశ్ డియో 1926 జనవరి 30న జన్మించారు. ‘ఆనంద్‌’, ‘మేరే ఆప్నే’ వంటి సినిమాలు రమేశ్ కెరీర్‌ని అగ్రస్థానంలో నిలిపాయి.

Chalo Vijayawada : విజయవాడకు ఉప్పెనలా ఉద్యోగులు.. సీఎంతో మాత్రమే చర్చలంటూ అల్టిమేటం

250కి పైగా సినిమాల్లో నటించిన రమేశ్ డియో నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. 2013లో 11వ పుణె ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో రమేశ్ డియో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు