Black Tiger : ఒడిషా అడవుల్లో అరుదైన నల్లపులి

బ్లాక్ టైగర్ అతి అరుదైన జాతి పులి ఇది. ఒడిశాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్‌లో అరుదైన జాతికి చెందిన నల్లపులి ఒకటి కెమెరా కంటికి చిక్కింది.

Black Tiger :  బ్లాక్ టైగర్ అతి అరుదైన జాతి పులి ఇది. ఒడిశాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్‌లో అరుదైన జాతికి చెందిన నల్లపులి ఒకటి కెమెరా కంటికి చిక్కింది. వీటిని మెలనిస్టిక్ టైగర్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణ పులులకు భిన్నంగా శరీరంపై నల్లని చారలను కలిగి ఉంటాయి.

ఇందుకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఫారెస్ట్ ఆఫీసరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పులి చెట్టు ఎక్కటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఈ మెలనిస్టిక్ పులులు గంభీరమైన నల్లని చారల వెనుక కారణం రెండు విభిన్న జాతుల పులుల కలయిక అని చెబుతున్నారు. మ్యుటేషన్ వల్లనే ఈ పులుల చారలు విలక్షణమైన నల్లని రంగు, నారింజ రంగు కాంబినేషన్‌లో వ్యాపించాయని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు