PFAS in rainwater : వర్షంలో తడిస్తే ఇకపై పిల్లలు పుట్టరట

వర్షం అంటే అందరికీ ఇష్టమే. కావాలని తడిసే వారు కూడా ఉంటారు. వర్షంలో తడిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. కానీ పిల్లలు పుట్టరని, హార్మోనల్ సమస్యలు, శృంగార సమస్యలు తలెత్తుతాయని చాలామందికి తెలియకపోవచ్చును . అందుకు కారణం PFAS రసాయనమట..

PFAS in rainwater

PFAS in rainwater : వర్షం అంటే చాలామందికి ఇష్టం. తడవడానికి చాలా ఇష్టపడతారు. వర్షంలో తడిస్తే జలుబు, జ్వరం, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన సమస్యలు ఎదురౌతుంటాయి. అయితే వర్షం నీటిలో తడిస్తే పిల్లలు పుట్టరట.  దాంతోపాటు కొన్ని రకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం కూడా ఉందట. అందుకు కారణం పర్ పాలీఫ్లోరినేటెడ్ సబ్ స్టేన్సెస్ PFAS అనే రసాయన పదార్ధం వర్షంలో కలవడమే కారణమట.

Sour foods in pregnancy : ప్రెగ్నెన్సీ టైంలో పులుపు ఎందుకు తింటారంటే?

PFAS అనే రసాయనాన్ని పరిశ్రమల్లో తయారు చేస్తారు. 1940 నుంచి ఈ రసాయనాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా స్టెయిన్, వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్స్, కార్పెటింగ్, క్లీనింగ్ ప్రాడక్ట్స్, వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్స్, పెయింట్స్, ఫైర్ ఫైటింగ్ ఫోమ్‌ వంటి ఉత్పత్తులో ఈ రసాయనాన్ని వాడతారు.

 

ఈ PFAS అనేది పరిశ్రమల నుంచి విడుదలై కాలువలు, నదులు అలా మహా సముద్రాలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి సముద్రంలోని స్ప్రే ఏరో సోల్స్ ద్వారా వాతావరణంలోకి చేరి వర్షం ద్వారా ఆ రసాయనం భూమిపై పడుతుంది. భూమిపై ఈ రసాయనంతో మిళితమై కురిసిన వర్షం వల్ల దశాబ్దాల తర్వాత పర్యావరణ ముప్పు కలగవచ్చు. US పరిశోధకులు దశాబ్ద కాలంగా జరిపిన పరిశోధనలో వర్షపు నీరు ప్రజలు వినియోగించడానికి ఏ మాత్రం సురక్షితం కాదని కనుగొన్నారు.

Pregnancy : గర్భధారణ సమయంలో సాధారణ సమస్యలు ! కారణాలు, వాటిని ఎదుర్కోవటానికి చిట్కాలు..

PFAS రసాయనంతో కలిసిన వర్షపునీటిలో తడిస్తే అనేక శృంగార సమస్యలతో పాటు పిల్లలు పుట్టకపోవడం, కొలెస్ట్రాల్ సమస్యలు, హార్మోనల్ సమస్యలు, పిల్లల ఎదుగుదలలో సమస్యలు వంటివి ఎదురౌతాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షంలో తడవడం ఇష్టంగా అనిపించవచ్చును. కానీ PFAS వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఆ నీటిలో కలిసి మనుష్యుల మనుగడకు ప్రమాదం తెచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్రెండింగ్ వార్తలు