Weight loss tip : వీటిని వాసన చూస్తేనే బరువు తగ్గుతారట

బరువు ఎక్కువ అవుతున్నామని ఆందోళన చెందుతున్నారా? విపరీతంగా డైట్ పాటిస్తున్నారా? వ్యాయామాలు చేస్తున్నారా? ఒక పని చేయండి.. ఈ పదార్ధాలు వాసన చూడండి.. వెయిట్ తగ్గిపోతారట.

Weight loss tip

Weight loss tip : బరువు తగ్గాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆఖరికి ఇష్టమైన ఆహారం తినకుండా స్ట్రిక్ట్‌గా డైట్ పాటిస్తారు. వ్యాయామాలు చేస్తారు. అయితే కొన్ని పదార్ధాలు వాసన చూస్తేనే బరువు తగ్గుతారట. ఇంట్రెస్టింగ్ కదా.. అవేంటో తెలుసుకుందాం.

ఆకలి మందగించిందా? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీ ఆకలిని పెంచటంలో సహాయపడతాయ్!

ఆలివ్ ఆయిల్‌తో చేసిన ఆహారాన్ని తినడం.. ఆలివ్ ఆయిల్‌ను వాసన చూడటం రెండూ కూడా మంచి అనుభూతిని ఇస్తాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫుడ్ కెమిస్ట్రీ నిర్వహించిన ఒక అధ్యయనంలో సుగంధ సారం ఉన్న ఆయిల్‌ను తీసుకునే వ్యక్తులు తక్కువ కేలరీలు వినియోగిస్తారని.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. వెల్లుల్లి ఎక్కువగా వంటకాల్లో వినియోగిస్తాం. ఇది ఎక్కువగా సువాసన వచ్చే పదార్ధం. బలమైన సువాసనలు ఉన్న పదార్ధాలు స్మెల్ చూడటం వల్ల మనం తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తాయట.

 

స్మెల్ అండ్ టేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ జరిపిన అధ్యయనంలో ఆకలితో ఉన్నప్పుడు అరటిపండ్లు లేదా గ్రీన్ ఆపిల్ వాసన చూస్తే ఎక్కువ బరువును కోల్పోతారట. ఎక్కువగా తీపి వాసనలు ఉన్న పదార్ధాలు ఆకలిని మందగించేలా చేస్తాయట. గ్రీన్ ఆపిల్, అరటిపండు అందుబాటులో లేకపోతే వెనీలా లేదా పిప్పరమెంటు బిళ్లను స్నిఫ్ చేయడానికి ప్రయత్నించండి. లైకోరైస్ సువాసనతో ఉన్న క్రంచీ రిఫ్రెష్ ప్లాంట్  ఫెన్నెల్ ఆకలిని అణచివేసేందుకు పనిచేస్తుందట.

Palmyra Sprout : ఆకలిని నియంత్రించటం ద్వారా బరువు తగ్గేలా చేసే తేగలు! వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే?

తాజాగా ఉండే పుదీనా వాసన చూసినా ఆకలిని అరికడుతుందట. దీనితో తయారు చేసిన నూనె నరాల బలానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనిని వాసన చూడం వల్ల జీవక్రియ కూడా వేగవంతమౌతుంది. ఇలా కొన్ని పదార్ధాలు వాటికుండే వాసనలు చూడటం వల్ల మనలో ఆకలి తగ్గి బరువు తగ్గుతామట. ఏది ఏమైనా సహజసిద్ధంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేయడం మన శరీర ఆరోగ్యానికి మంచిది.

 

ట్రెండింగ్ వార్తలు