RRR: ఓటీటీలో ట్రిపుల్ ఆర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

RRR: ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్లే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ట్రిపుల్ ఆర్. బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల పంజా విసురుతోంది.

కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆర్ఆర్ఆర్ ట్రెమెండస్ రెస్పాన్స్‌ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతుంది. రెండు వేల కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్2 మ్యానియాను కూడా తట్టుకొని థియేటర్లలో నిలబడుతుంది. ఇక, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా ఇంకోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ముహూర్తం ఫిక్సయినట్లు వినిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా జీ-5, నెట్ ప్లిక్స్ ద్వారా ఓటీటీ రిలీజ్ కానుందని సినిమా రాకముందే ప్రచారం జరుగుతూ వస్తుంది. కాగా ఈ సినిమా జూన్ 3 నుంచి అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందట. డిజిటల్ రిలీజ్ పై ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ లేదు కానీ త్వరలోనే స్ట్రీమింగ్ పై ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు