Annaatthe: సూపర్ స్టార్ రజినీకాంత్, ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘అన్నాత్తే’ లో రజినీ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంది. కీర్తి సురేష్ కీలకపాత్రలో కనిపించనుంది.
Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..
ఇటీవల బాలు, రజినీ కోసం చివరిగా పాడిన టైటిల్ సాంగ్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. డి.ఇమాన్ ట్యూన్, యుగ భారతి లిరిక్స్, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్, సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్‌ల వాయిస్ పాట స్థాయిని పెంచేసాయి.
Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..
‘సారా సారా కాట్రే’ అంటూ సాంగే ఈ బ్యూటిఫుల్ మెలోడి రజినీ ఫ్యాన్స్, ఆడియన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. లిరికల్ వీడియోలో రజినీ, నయన్‌ల పెయిర్ బాగుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. రజినీ సరికొత్త క్యారెక్టర్లో కనిపించనున్నారు. దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది.