Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
Salaar : సలార్ సెట్లో బర్త్ డే సెలెబ్రేషన్స్.. శరవేగంగా సలార్ షూటింగ్.. ఫ్యాన్స్ ఖుషి..
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకోగా, జనవరి చివరినాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సందర్భంగా జనవరిలో ఈ చిత్రానికి సంబంధించి రఫ్ కట్‌ను వీక్షించి, ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్‌పై ఓ నిర్ణయం తీసుకునేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. గతంలో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రానికి కూడా ఇలాంటి పంథానే ఫాలో అయ్యాడు.
సలార్ సినిమా షూటింగ్ పూర్తవగానే, ఆ సినిమా సీక్వెల్‌పై ఓ నిర్ణయం తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో అభిమానులు ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.