TNPL : ప‌ర‌మ చెత్త బౌలింగ్‌.. ఒక్క బంతికి 18 ప‌రుగులు.. మాకొద్దు సామీ..!

అంత‌ర్జాతీయ క్రికెట్ లో కావొచ్చు లేదంటే రంజీలు, లీగ్ మ్యాచుల్లోనైనా స‌రే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఒక్క ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ల‌ను చూశాం.

Abhishek Tanwar

TNPL 2023 : అంత‌ర్జాతీయ క్రికెట్ లో కావొచ్చు లేదంటే రంజీలు, లీగ్ మ్యాచుల్లోనైనా స‌రే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఒక్క ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ల‌ను చూశాం. అయితే.. ఒక్క బంతికి అత్య‌ధిక ప‌రుగులు ఇచ్చిన ఓ బౌల‌ర్ గురించి తెలుసుకుందాం. 6 కాదు 8 కాదు 12 కాదు 15 కాదు ఏకంగా 18 ప‌రుగులు ఇచ్చాడు. అవును ఇది నిజంగా నిజం. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌(TNPL)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మంగ‌ళ‌వారం రాత్రి టీఎన్‌పీఎల్‌లో భాగంగా చెపాక్ సూప‌ర్ గిల్లీస్‌, సేలం స్పార్టాన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. చెపాక్ సూప‌ర్ గిల్లీస్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌ను సేలం స్పార్టాన్స్ కెప్టెన్‌ అభిషేక్‌ తన్వర్ వేశాడు. మొద‌టి ఐదు బంతుల్లో 8 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో 19.5 ఓవ‌ర్ల‌కు చెపాక్‌ 5 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగుల‌తో ఉంది. అయితే.. ఆఖ‌రి బంతికి అత్యంత చెత్త రికార్డును న‌మోదు చేశాడు.

Ravichandran Ashwin : మౌనం వీడిన అశ్విన్‌.. అది ఎంతో బాధించింది

ఆఖ‌రి బంతిని ఎదుర్కొన్న చెపాక్ బ్యాట‌ర్ సంజయ్‌ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇన్నింగ్స్ ముగిసింద‌ని అంద‌రూ అనుకోగా అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఇంకేముంది ఫ్రీ హిట్‌గా వ‌చ్చిన బంతికి సంజ‌య్ సిక్స్ కొట్టాడు. అయితే.. ఆ బంతి కూడా నోబాల్ కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌రువాతి బంతికి రెండు ప‌రుగులు వ‌చ్చాయి. అయితే.. ఇది కూడా నో బాల్. ఆ మ‌రుస‌టి బంతి వైడ్ గా వెళ్లింది. ఎట్ట‌కేల‌కు నోబాల్ వేయ‌కుండా వేయ‌గా అది సిక్స్‌గా వెళ్లింది. మొత్తంగా ఆఖ‌రి బంతికి మూడు నోబాల్స్‌, ఒక వైడ్, రెండు సిక్స్‌లు, ఒక డబుల్ ర‌న్స్ వ‌చ్చాయి. అంటే మొత్తం 18 ప‌రుగులు ఇచ్చాడు.

Gautam Gambhir : ధోని వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌లు రాలేదు.. అలా అత‌డిని హీరోని చేశారు.. నిజ‌మైన‌ హీరో గురించి మాత్రం మాట్లాడ‌రు

ఈ బాల్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నీలాంటి బౌల‌ర్లు మాకొద్దు సామీ అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన చెపాక్‌ సూపర్‌ గల్లీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 217 పరుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో సేలం స్పార్టాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 52 పరుగుల తేడాతో చెపాక్ సూప‌ర్ గిల్లీస్ విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు