Samantha: సామ్ క్రేజీ ఫార్ములా.. సినిమాలన్నీ డిఫరెంట్ రోల్సే!

ఊ అంటావా అంటూ రచ్చ చేస్తోన్న సామ్ ఆ ఊపును కంటిన్యూ చేయాలనుకుంటోంది. డిఫరెంట్ రోల్స్ లో వరుసపెట్టి ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లతో ఓ వైపు టైఅప్ అవుతూనే..

Samantha: ఊ అంటావా అంటూ రచ్చ చేస్తోన్న సామ్ ఆ ఊపును కంటిన్యూ చేయాలనుకుంటోంది. డిఫరెంట్ రోల్స్ లో వరుసపెట్టి ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లతో ఓ వైపు టైఅప్ అవుతూనే.. లేడీ ప్రొడ్యూసర్ ని బాలీవుడ్ లో సెట్ చేస్తోంది. విమెన్ సెంట్రిక్ సినిమాలతో సక్సెస్ లో ఉన్న ఓ హిట్ హీరోయిన్ తో సామ్ చేయి కలుపుతుందనే వార్తలు ఈమధ్య ట్రెండ్ అవుతోన్నా.. అది నిజమయ్యే ఛాన్స్ ఇప్పుడు కనిపిస్తోంది.

2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

నాగచైతన్యతో సెపరేషన్ తర్వాత బ్రేక్ తీసుకుని ఫ్రెండ్స్ తో ట్రిప్పులు, గుళ్లు, గోపురాలు, సెలబ్రేషన్స్ ఇలా అన్ని రకాలుగా టైమ్ స్పెండ్ చేసిన సమంత.. ప్రెజెంట్ కెరీర్ మీద ఫోకస్ చేసింది. సడెన్ డెసిషన్ తీసుకొని సామ్ చేసిన పుష్ప ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఊర్రూతలూగిస్తోంది. ఇక ఇప్పటికే శాకుంతలం, కాదు వాకుల రెండు కాదల్ సినిమాల తర్వాత యశోద, అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. రీసెంట్ గా ఈ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో తాప్సీ ప్రొడక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమాకు కమిటయింది.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

ఫ్యామిలీ మ్యాన్ 2తో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ లో డైరెక్ట్ ఫిల్మ్ చెయ్యడానికి రెడీ అయ్యింది. బాలీవుడ్ లో వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ.. సక్సెస్ ట్రాక్ లో ఉన్న తాప్సీ.. తన సొంత ప్రొడక్షన్ హౌజ్ అవుట్ సైడర్ ఫిల్మ్స్ ద్వారా సమంత లీడ్ రోల్ లో సినిమా ప్లాన్ చేసింది. ఫీమేల్ సెంట్రిక్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తాప్సీ నిర్మాణంలో సెట్స్ మీదకెళ్లబోతోంది.

Pushpa : సంక్రాంతికి ఓటిటిలో ‘పుష్ప’ ??

బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికి అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్న సమంత.. తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ ని కూడా స్పీడప్ చేసింది. ప్రజెంట్ ఆమె చేస్తున్నవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లే. శాకుంతలంలో శకుంతలగా నటించిన సామ్.. యశోదలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో కలిసి సూపర్ రోల్ చేస్తోంది. ఆరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ లో ఆమెది బైసెక్సువల్ క్యారెక్టర్. అటు మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లోనూ ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ఇలా క్రేజీ ఫార్ములాను అప్లై చేస్తోన్న సామ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ని మార్కెట్ చేస్కోడానికి ట్రై చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు