Nandini Reddy : నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు.. సమంత ఎమోషనల్ పోస్ట్..

నందిని రెడ్డితో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. ''పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన మిత్రమా. నీ మంచితనమే నీ గొప్పతనం. నువ్వే నాకు స్ఫూర్తి. నాకు ఇంకా గుర్తుంది అది 2012 సంవత్సరం.....

 

Samantha :  సమంత, నందిని రెడ్డి మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి చాలా ప్రాజెక్టులు చేశారు. సమంత నటించిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలకు నందిని రెడ్డినే డైరెక్టర్. అంతే కాక ఇటీవల సమంత ఆహాలో చేసిన ‘సామ్ జామ్’ షోకి కూడా నందినినే డైరెక్టర్. సమంత చేసిన కొన్ని యాడ్స్‌కి కూడా నందిని డైరెక్షన్ చేసింది. వీరిద్దరూ కలిసి పార్టీలకు కూడా వెళ్తుంటారు. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో నందిని ముందు ఉంటుంది. నిన్న నందిని రెడ్డి బర్త్‌డే సందర్భంగా తన ఇంస్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత.

నందిని రెడ్డితో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. ”పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన మిత్రమా. నీ మంచితనమే నీ గొప్పతనం. నువ్వే నాకు స్ఫూర్తి. నాకు ఇంకా గుర్తుంది అది 2012 సంవత్సరం. అప్పుడు నేను అస్సలు బాగోలేను. నా ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంది. నేను వర్క్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ అప్పుడు నువ్వు వచ్చి డైలీ నన్ను కలిసే దానివి. నాలో ఆత్మవిశ్వసాన్ని నింపావు. నీ బిజీ షెడ్యూల్ లో కూడా నా కోసం టైం కేటాయించావు. నువ్వు
కలిసి వెళ్ళాక నేను బాగా పని చేసేదాన్ని. నా పీక్ స్టేజిలలో నాతో ఉన్నావు, నేను డౌన్‌లో ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నావు.”

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ నుంచి ర్యాప్ సాంగ్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్..

”ప్రతిరోజూ మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటానికి నువ్వు నన్నుసపోర్ట్ చేస్తావు. నువ్వు నన్ను చాలా నమ్మావు. నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్. నీకు రాబోయే సంవత్సరాలలో కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అని చాలా ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు