Comic Con : అసలు ‘కామిక్ కాన్’ ఏంటి? ప్రభాస్ ప్రాజెక్ట్ K ఎందుకు ‘కామిక్ కాన్’కి వెళ్తుంది?

ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. దీంతో అసలు ఈ 'కామిక్ కాన్' ఏంటి, ప్రాజెక్ట్ K టీం ఎందుకు అక్కడికి వెళ్తుంది అని చాలామంది వెతికేస్తున్నారు.

San Diego Comic Con why Project K go to this event in America

San Diego Comic Con :  ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా అనేకమంది స్టార్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది.

దీంతో అసలు ఈ ‘కామిక్ కాన్’ ఏంటి, ప్రాజెక్ట్ K టీం ఎందుకు అక్కడికి వెళ్తుంది అని చాలామంది వెతికేస్తున్నారు. ‘కామిక్ కాన్’ అనేది ఒక NGO లాంటిది. అయితే అన్ని NGO లు సేవ చేస్తే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్స్ చేస్తుంది. చాలామందికి కామిక్స్ అంటే ఇష్టం ఉంటాయి. అంటే సూపర్ హీరోస్, డిస్ని, మిక్కీ మౌస్.. ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ కామిక్స్ లో కూడా చూస్తాం. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ కామిక్స్ ని ఇష్టపడతారు.

అందుకే సినిమాలకు సంబంధించిన వాటిని, సినిమా కామిక్స్ ని అందరికి తెలియచేసేలా చేసే ఓ ఈవెంట్ ‘కామిక్ కాన్’. 1970లో అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో కామిక్ కాన్ ఈవెంట్ ని ప్రారంభించారు. మొదటి సంవత్సరం ఈ ఈవెంట్ కి కేవలం 300 మంది వచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ‘కామిక్ కాన్’ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది సినిమా ప్రేమికులు, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి విచ్చేస్తారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఈవెంట్ కి లక్షల్లో జనాలు వస్తున్నారు.

ఈ ఈవెంట్ లో ముఖ్యంగా కామిక్ బుక్స్ ని, సినిమాలను కామిక్స్ లాగా ప్రదర్శిస్తారు. అలాగే కామిక్ బుక్స్, సినిమా వాళ్ళు తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నాలుగు లేదా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్స్, అవార్డ్స్, మ్యూజియం, కామిక్ క్యారెక్టర్స్ లా విచిత్ర వేషధారణలు, ఎగ్జిబిషన్.. ఇలా చాలా ఉంటాయి. కామిక్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, కామిక్స్ ని ఇష్టపడేవాళ్ళకి మధ్యలో ఇది ఒక మీడియంలా పనిచేస్తుంది. ‘కామిక్ కాన్’ కి అన్ని దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో కొంతమంది అభిమానులు తమ దేశాల్లో కూడా ‘కామిక్ కాన్’ ఈవెంట్ అప్పుడప్పుడు చేయడం మొదలుపెట్టారు. మన ఇండియాలో ముంబైలో కూడా ‘కామిక్ కాన్’ ఈవెంట్ గతంలో జరిగింది. పలువురు సూపర్ హీరోలు, కామిక్స్ క్యారెక్టర్స్ లో రెడీ అయి వచ్చి సందడి చేస్తారు ఈ ఈవెంట్ లో.

‘కామిక్ కాన్’ ఈవెంట్ లో తమ సినిమాని ప్రమోట్ చేయడం వలన ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులకు తమ సినిమాలు దగ్గరవుతాయి. అలాగే సూపర్ హీరోలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ఈవెంట్ కి పిల్లలు కూడా చాలా మంది వస్తారు. దీంతో పిల్లలకు ఆ క్యారెక్టర్స్ తో మరింత కనెక్ట్ అవ్వొచ్చు. అందుకనే ప్రాజెక్ట్ K టీం ‘కామిక్ కాన్’ ని ఎంచుకుంది. మన ఇండియా నుంచి ‘కామిక్ కాన్’ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి సినిమా ప్రాజెక్ట్ K కావడం విశేషం. దీంట్లో సినిమాని ప్రమోట్ చేస్తే హాలీవుడ్ లో మార్కెట్ సంపాదించొచ్చు. అలాగే ఇందులో ప్రభాస్ ది సూపర్ హీరో క్యారెక్టర్ అని టాక్ వస్తుంది. అందుకే కామిక్స్ ని ఇష్టపడేవాళ్ళకి ఈ క్యారెక్టర్ ని కనెక్ట్ చేయొచ్చు. దాంతో ప్రాజెక్ట్ K కి వరల్డ్ మార్కెట్ వస్తుందని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది.

Project K : ప్రాజెక్ట్ K సరికొత్త చరిత్ర.. ‘కామిక్ కాన్’కి వెళ్లనున్న ఫస్ట్ ఇండియన్ ఫిలింగా రికార్డ్.. ఆ రోజే గ్లింప్స్?

ఈ సంవత్సరం ‘కామిక్ కాన్’ జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలవుతుంది. జులై 23 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాల్గొననున్నారు. అదే రోజు ప్రాజెక్ట్ K సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రభాస్ అభిమానులు ఈ అప్డేట్ తో మరింత సంతోషిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు