Jawan Non theatrical rights : బాలీవుడ్ బాద్ షా క్రేజ్.. ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే.. రూ.250 కోట్లకు అమ్ముడైన ‘జవాన్’ నాన్ థియేట్రికల్ రైట్స్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టిస్తున్న సినిమా ‘జవాన్’. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది.

Shahrukh Khan Jawan movie

Jawan movie Non theatrical rights : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan) న‌టిస్తున్న సినిమా ‘జవాన్’(Jawan). త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై స్వ‌యంగా షారుక్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Salaar : టీజర్‌తో కేజీఎఫ్ 2 రికార్డు బద్దలుకొట్టిన సలార్.. మొదటి 5లో నాలుగు ప్రభాస్ పేరునే..

ప‌ఠాన్ సినిమాతో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన షారుఖ్ ఖాన్‌ అదే ఊపును కంటిన్యూ చేస్తూ జ‌వాన్‌ను సూప‌ర్ హిట్ చేయాల‌ని చూస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్లే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ఏకంగా రూ.36 కోట్లుకు T సిరీస్ సొంతం చేసుకోగా నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం మంచి ధ‌ర ప‌లికిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్ర ట్రైల‌ర్ ఇంకా విడుద‌ల కాక‌ముందే సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు పోయిన‌ట్లు తెలుస్తోంది.

Chiranjeevi : భోళా మూవీ వర్క్స్ కంప్లీట్.. అమెరికా వెకేషన్ టూర్‌కి చిరు..

షారుక్ ఉన్న క్రేజ్ ఎంట‌నేది దీనితోనే స్ప‌ష్ట‌మైంది. అలాగే ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు