భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో రామసేతు.. ఏళ్లనాటి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఇస్రో

ఫైనల్‌గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది.

How ISRO scientists uncover Ram Setu secrets with help from a NASA satellite

Ram Setu undersea map: రామసేతు. ఈ పేరు వింటేనే హిందూవుల్లో ఏదో డివోషనల్ ఫీలింగ్. రాముడే కట్టాడన్న కథనాలతో ప్రజల్లో విపరీతమైన నమ్మకం. అందుకే లక్షల మంది వారధి ఉందన్న ప్రాంతానికి వెళ్లి సందర్శించి వచ్చారు. ప్రధాని మోదీ కూడా అక్కడి వెళ్లారు. చాలా రోజులుగా రామసేతుపై అనేక చర్చలు ఉన్నాయి. రామసేతు ఉందని నమ్మేవారు కొందరైతే.. అక్కడ ఎలాంటి వారధి లేదని వాదించేవారు మరికొందరు. ఫైనల్‌గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది.

ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్-2 డేటాను వాడి రామసేతు మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు ఉంది. నిర్మాణ సమయంలో సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఎత్తులో ఉన్నట్టు నిర్ధారించారు. రామసేతు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వారధి 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రామసేతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధైగా పిలుస్తుండేవారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వారధి 1480 వరకు తుఫానులతో కొంత ధ్వంసమైంది.

నాసా ఉపగ్రహం సహాయంతో..
రామసేతును కనుగొనడంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ వారధి చరిత్ర 18 వేల సంవత్సరాల కిందటిది. ఇప్పుడు ఇస్రో అయితే రామసేతు ఉందన్న విషయాన్ని కన్ఫామ్ చేసింది. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్‌ దీవుల వరకు ఈ వారధి ఉంటుంది. రామసేతును కనుగొనేందుకు కొన్నాళ్లుగా ఎన్నో పరిశోధనలు చేస్తోంది ఇస్రో. అందులో భాగంగా రహస్యాల ఛేదనలో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్‌ బ్రిడ్జిగా పిలిచే రామసేతు మ్యాప్‌ను రిలీజ్ చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుంది. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేశారు.

Also Read : ఐదు చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర, వైఢూర్యాలు.. లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల సమయం!

రామాయణ కాలంలో నిర్మించారా?
అయితే శ్రీలంక దీవుల్లో 12 మీటర్ల లోతైన, 300 మీటర్ల వెడల్పున సీతాసముద్రం ప్రాజెక్టును కట్టేందుకు 2005లో యూపీఏ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కాంట్రవర్సీ అయింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. ఈ ప్రాజెక్టుతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు, 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని భావించారు. కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి రావడంతో హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. 2007లో సుప్రీంకోర్టు సీతాసముద్రం ప్రాజెక్టును నిషేధించింది. ఆ తర్వాత 2021లో మోదీ ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధనకు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. రామసేతు మానవ నిర్మితమా, కాదా? రామాయణ కాలంలో దీనిని నిర్మించారా? అన్నది తెలుసుకోవడం కోసం మూడేళ్ల పరిశోధన చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు