Bigg Boss 5 : ఎట్టకేలకు కెప్టెన్ అయిన షన్ను.. ఆనందంలో అభిమానులు

ఈ టాస్కుల్లో విన్ అయిన వాళ్లందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సిరి, శ్రీరామ్, షన్ను, యని మాస్టర్, మానస్, సన్నీలు కలిసి చివరి కెప్టెన్సీ టాస్కుని ఆడారు

Bigg Boss 5 :  బిగ్ బాస్ మొదలై ఇప్పటికే 50 రోజులు దాటిపోయింది. ఇప్పటికే ఏడుగురు ఎలిమినేటి అయ్యారు. ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. ఎక్కువగా నామినేషన్స్ టైంలో, కెప్టెన్సీ టాస్క్ కోసం గొడవలు జరుగుతాయి. ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వడం కోసం గట్టిగానే పోరాడతారు. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్కులే ఇస్తాడు. ఈ సారి ఇంకా కష్టతరమైన టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్‌ లకు ఆవుపేడలో ముత్యాలు ఏరే టాస్క్ ఇచ్చాడు. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్క్ ఇచ్చాడు. మానస్‌, శ్రీరామచంద్రలకు బలమైన తాళ్లను ఊపే టాస్క్ ఇచ్చారు. యాని మాస్టర్, ప్రియాంకలకి పెయింటింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

Romantic Movie : కొడుకు కోసం డైరెక్టర్స్ అందర్నీ దింపిన పూరి జగన్నాధ్

సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్కులో సిరి గెలిచింది. మానస్‌, శ్రీరామచంద్రలు బలమైన తాళ్లను అలిసిపోయి ఆగిపోయేదాకా ఉపాలి ఇందులో శ్రీరామ్ గెలిచాడు. ఇక లోబో, షణ్ముఖ్ లకు పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను వేసి ఆ ముత్యాలని ఒక్కొక్కటిగా బయటకి తీయాలని టాస్క్ ఇచ్చారు. ఇద్దరూ ఆ పేడలో దొర్లాడి ముత్యాలను ఏరారు. ఇచ్చిన టైంలో షన్ను ఎక్కువ ముత్యాలు ఏరి టాస్కులో గెలిచాడు. ఇక యాని మాస్టర్, ప్రియాంకలకి ఒక వైట్ బోర్డు ఇచ్చి ఇద్దరికీ రెండు రంగులు ఇచ్చారు. ఆ రంగులతో ఎవరు ఎక్కువగా డామినేట్ చేసేలాగా బోర్డుకి కలర్ పూస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్కులో యాని మాస్టర్ విన్ అయింది.

Sports Movies : ఆటే కథ.. ఆటే సినిమా.. గేమ్స్ తో బాక్సాఫీస్ లో గోల్ కొడుతున్నారు

ఇక ఈ టాస్కుల్లో విన్ అయిన వాళ్లందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సిరి, శ్రీరామ్, షన్ను, యని మాస్టర్, మానస్, సన్నీలు కలిసి చివరి కెప్టెన్సీ టాస్కుని ఆడారు. ఈ టాస్క్ లో అందరికి థర్మోకోల్ బాల్స్ తో నిండిన బ్యాగ్స్ ఇచ్చి ఒకరి బ్యాగ్ లో థర్మోకోల్స్ ఇంకొకరు ఖాళీ చేయాలి ఇచ్చిన టైంలో. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ థర్మోకోల్స్ ఉంటే వాళ్ళు కెప్టెన్ అవుతారని తెలిపారు. ఇందులో సిరి షన్నుకి సపోర్ట్ చేయడంతో షన్ను మొదటి సారిగా కెప్టెన్ అయ్యాడు. చాలా రోజుల నుంచి షన్ను సైలెంట్ గానే ఉంటున్నాడు. అందరి లాగా ఫైర్ అవ్వకుండా గేమ్స్ ఆడుతున్నాడు. షన్నుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ మొదలై 7 వారాలు అయినా ఇప్పటిదాకా షన్ను కెప్టెన్ అవ్వకపోవడంతో అభిమానులు బాధపడ్డారు. తాజాగా టాస్కులన్నీ బాగా ఆడి చివరికి కెప్టెన్ అయ్యాడు షణ్ముఖ్. దీంతో షణ్ముఖ్ అభిమానులు ఆనందిస్తున్నారు. సోషల్ మీడియాలో షన్నుకి అనుకూలంగా అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు