Corona Cases : దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది.

Corona Cases : దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 396 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,09,940 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 539 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది.

చదవండి : Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

ప్రస్తుతం రికవరీ రేటు 98.33 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటి రేటు 0.79 శాతం ఉంది. 24గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 10,264 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కి చేరగా.. మరణాల సంఖ్య 4,66,980 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,39,67,962 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

చదవండి : Corona Cases : దేశంలో ఏడాదిన్నర కనిష్టానికి కరోనా కేసులు

ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 119.38 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 90,27,638 డోసుల టీకాలు అందచేశారు.

ట్రెండింగ్ వార్తలు