Air pollution in Delhi : ఢిల్లీని క‌మ్మేసిన కాలుష్య భూతం..!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీని కాలుష్య భూతం కమ్మేసింది. గాలి నాణ్య‌త సూచీ కూడా ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరుకుంది. న‌గ‌రమంతా పొగ క‌మ్మేసింది.

Air pollution in Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీని కాలుష్య భూతం కమ్మేసింది. గాలి నాణ్య‌త సూచీ కూడా ప్ర‌మాద‌క‌ర స్థితికి చేరుకుంది. న‌గ‌రమంతా పొగ క‌మ్మేసింది. మందపాటిగా పొగ‌మంచు క‌ప్పేయడంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముందుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఛత్‌పూజాపై దట్టమైన పొగమంచు ఏర్పడటంతో సూర్యరశ్మిని పాక్షికంగా కప్పేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత కాలుష్య కారకాలు తీవ్రస్థాయిలో పేరుకుపోయాయి. గ్రీన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) ప్రకారం.. ప్రస్తుతం పొగమంచు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి దారితీసిందని పేర్కొంది. గాలి లేనప్పుడు కాలుష్యం మరింత పెరిగిపోకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వాహనాలు, పరిశ్రమలు, వ్యర్థాలను కాల్చడం, ధూళి మూలాలపై తక్షణ అత్యవసర చర్య అవసరమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్‌చౌదరి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో 24 గంటల వాయు నాణ్యత సూచిక (AQI) 411 వద్ద నమోదు అయింది.

ఢిల్లీలో 39 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలోనూ వాయు కాలుష్య స్థాయిల తీవ్రతను నమోదు చేసింది. బుధవారం రోజున 24 గంటల సగటు AQI 372గా ఉంది. ఫరీదాబాద్ (412), ఘజియాబాద్ (461), గ్రేటర్ నోయిడా (417), నోయిడా (434)లలో కూడా గురువారం సాయంత్రం 4 గంటలకు తీవ్రమైన గాలి నాణ్యత నమోదైంది. సున్నా 50 మధ్య ఉన్న AQI మంచిదిగా పరగిణిస్తారు. అదే.. 51 నుంచి 100 సంతృప్తికరమైనది అని అర్థం. అలాగే 101 నుంచి 200 వరకు మితమైనది, 201 నుంచి 300 చాలా పూర్, 301 నుంచి 400 చాలా పేలవమైనది, 401 నుంచి 500 తీవ్రమైనదిగా గాలి నాణ్యతను పరిగణిస్తారు. భారత వాతావరణ శాఖ (IMD) అధికారి మాట్లాడుతూ ఉదయం నిస్సారమైన పొగమంచుతో పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ఢిల్లీలో గురువారం సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 12.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో విజిబిలిటీ స్థాయిలు 600-800 మీటర్లకు పడిపోయాయి.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన పొగమంచు మరో రోజు కొనసాగే అవకాశం ఉందని CSE తెలిపింది. గత 4 సంవత్సరాలలో మొదటి స్మోగ్ ఎపిసోడ్‌తో పోలిస్తే.. ప్రస్తుత పొగమంచు 2018, 2020 సీజన్‌ల మొదటి స్మోగ్ వ్యవధితో సమానంగా ఉంది. రెండూ నుంచి ఆరు రోజుల పాటు ఇలానే కొనసాగాయి. గాలి నాణ్యత పరిస్థితులు మెరుగుపడకపోతే, 2019లో కొనసాగిన పొగమంచును (8 రోజులు) అధిగమించవచ్చునని CSE తెలిపింది. ఢిల్లీ కాలుష్యంలో వ్యవసాయ మంటల వాటా ఆదివారం 48 శాతానికి పెరిగింది. నవంబర్ 5, 2018 తర్వాత అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. గత ఏడాది, నవంబర్ 5న ఢిల్లీ కాలుష్యంలో 42 శాతానికి చేరుకుంది. 2019లో, నవంబర్ 1న ఢిల్లీలోని PM2.5 కాలుష్యంలో పంట అవశేషాల దహనం 44 శాతంగా నమోదైంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. గాలి కాలుష్య సమస్యపై చర్చించేందుకు అన్ని NCR రాష్ట్రాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
Read Also : Corona Cases : తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ట్రెండింగ్ వార్తలు