Congress Plenary Session: బీజేపీపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు.. తన రాజకీయ రిటైర్మెంట్‌పైనా ప్రస్తావన ..

రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు.

Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన సభలు మూడు రోజుల పాటు జరుగుతాయి. శనివారం రెండో అగ్రనేతలు కీలక ప్రసంగాలు చేశారు. రెండో రోజు మహాసభల్లో ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ వాద్రాతో పాటు అగ్ర నేతలు పాల్గొన్నారు. రెండోరోజు మహాసభల్లో సోనియాగాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని చెప్పిన సోనియా.. నేడు దేశానికి, కాంగ్రెస్‌కు సవాలుతో కూడిన సమయమని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని, ప్రస్తుతం బీజేపీ హయాంలో అన్నివర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్ – బీజేపీ నియంత్రణలో ఉన్నాయని సోనియా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు.

Congress Plenary Session: రెండోరోజు కాంగ్రెస్ జాతీయ మహాసభలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక వాద్రా .. ఫొటోలు

దళితులు, మైనార్టీలు, మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని, కొందరు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సోనియా విమర్శించారు. 2004 – 2009 వరకు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా సమర్థవంతమైన నాయకత్వం నాకు వ్యక్తిగత సంతృప్తిని ఇచ్చిందని సోనియా చెప్పారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌కు ముగింపు పలకనున్నట్లు సోనియా చెప్పారు. అయితే, ఇక్కడ నాకు సంతోషకర విషయం ఏమిటంటే.. నా రాజకీయ జీవితం భారత్ జోడో యాత్రతో ముగుస్తుండటం అని అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఓ టర్నింగ్ పాయింట్ అని సోనియా చెప్పారు.

Priyanka Gandhi Vadra: పూల వర్షం .. ప్రియాంక వాద్రాకు కాంగ్రెస్ శ్రేణుల ఘనస్వాగతం.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు. బలమైన కార్యకర్తలే కాంగ్రెస్ కు బలమని, మనం క్రమశిక్షణతో పనిచేయాలని, మన సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలని సోనియా సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సోనియా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో పార్టీ విజయం దిశగా పయణిస్తుందని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు