Shahrukh Khan: దేశంపై నమ్మకాన్ని ఇనుమడింపజేసిన షారుఖ్ అభిమానం

సినిమా తారగా షారుఖ్ పై ఉన్న అభిమానం.. ఒక విదేశీయుడికి మన దేశంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి షారుఖ్ ఖాన్ కు వీరాభిమాని

Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు షారుఖ్. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ షారుఖ్ కు వీరాభిమానులు ఉన్నారు. దుబాయ్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, సహా మధ్యఆసియాలోని అనేక దేశాల్లో ఈయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే.. సినిమా తారగా షారుఖ్ పై ఉన్న అభిమానం.. ఒక విదేశీయుడికి మన దేశంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి షారుఖ్ ఖాన్ కు వీరాభిమాని. ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్న అతను.. ఇటీవల ఎటువంటి ముందస్తు రుసుము తీసుకోకుండానే ఒక భారత పర్యాటకురాలికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు.

Also read: Yamaha Bikes: సరికొత్త హంగులతో వచ్చిన Yamaha FZS-Fi, రేటు ఎంతంటే??

అశ్విని దేశ్ పాండే అనే మహిళ..ఇటీవల ఈజిప్టు వెళ్లేందుకు అక్కడి ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఆమె అతనికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేకపోయింది. దీంతో టికెట్ క్యాన్సిల్ చేయమంటూ సూచించింది. అయితే అందుకు ప్రతిగా సదరు ట్రావెల్ ఏజెంట్ స్పందిస్తూ.. “మీరు షారుఖ్ ఖాన్ నివసిస్తున్న దేశం నుంచి వస్తున్నారు. మీ దేశంపై నమ్మకం ఉంది. మరెవరైనా ఇలా చేసేవాడిని కాదేమో. కానీ షారుఖ్ కోసం ఏదైనా చేస్తా” అంటూ ఆమెకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన అశ్విని.. షారుఖ్ ఖాన్ అంటే విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో చూడండి అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన మరికొందరు దేశీయ పర్యాటకులు.. మాకూ గతంలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయంటూ రీ-ట్వీట్ లు చేశారు. ఒక కళాకారుడిగా భారత దేశ కీర్తిప్రతిష్టలను షారుఖ్ ఖాన్ ఎలా విశ్వవ్యాప్తం చేశాడో ఈ విషయం చూస్తే అర్ధం అవుతుంది.

Also read: Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్ లో వేలు పెట్టమన్న “అలెక్సా”

ట్రెండింగ్ వార్తలు